టాలీవుడ్ కు ‘కౌబాయ్’ సినిమాల కల్చర్ ను పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ. తెలుగులోనే కాదు సౌత్ లోనే ఆరోజుల్లో ఇదొక కొత్త ప్రయోగం. చాలా కాస్ట్ లీ ప్రయోగం కూడా అని చెప్పాలి. ఏ సినిమా గురించి చెబుతున్నానో తెలుసు కదా. ఎస్.. ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం గురించి. 1971 లో కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పద్మాలయ స్టూడియోస్’ బ్యానర్ పై కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు నిర్మించారు.
కథ పరంగా చెప్పుకోవాలంటే ఇది ఒక సింపుల్ రివేంజ్ డ్రామా. మంచి యాక్షన్ ఉంటుంది. గుర్రపు స్వారీలు ఉంటాయి. ఎమోషనల్ కనెక్టివిటీకి కూడా పెద్దపీట వేశారు. మే 31 న కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. విజయనిర్మల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఆదినారాయణ రావు సంగీతాన్ని అందించారు. 4K లోకి ఈ చిత్రాన్ని అప్డేట్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే కంటెంట్ పరంగా ఈ సినిమా సూపర్ హిట్. అందులో డౌట్ లేదు.
డిస్ట్రిబ్యూటర్లకు కూడా (Mosagallaku Mosagadu) ఈ చిత్రం లాభాలను అందించిందట. కాకపోతే నిర్మాత జి.ఆదిశేషగిరి రావుకి మాత్రం ఈ సినిమా నష్టాలనే మిగిల్చిందట. ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని రూ.7 లక్షల బడ్జెట్ లో నిర్మించారట. కానీ థియేట్రికల్ బిజినెస్ మాత్రం రూ.4 లక్షలు మాత్రమే జరిగిందట. రాజస్థాన్ ఎడారిలో, బికనీర్ కోట వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ ను జరిపారు. ‘టక్కరి దొంగ’ సినిమా టైంలో దర్శకుడు జయంత్ కు ఈ విషయాలు చెప్పి ముందుగానే హెచ్చరించారట కృష్ణ.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు