మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో జెఫ్రీ గీ చిన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ బ్యానర్ పై హీరో మంచు విష్ణునే ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. ‘ఖైదీ’ ఫేమ్ సామ్.సి.ఎస్ అందించిన నేపధ్య సంగీతం మినహా సినిమాలో ఆకట్టుకునే అంశాలు లేవు అంటూ కొంతమంది అంటుంటే విష్ణు, కాజల్ ల నటన మరియు సినిమాటోగ్రఫీ బాగుంది అని మరికొంత మంది ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు.
అయితే కలెక్షన్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఈ చిత్రం 2 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.18 cr |
సీడెడ్ | 0.08 cr |
ఉత్తరాంధ్ర | 0.07 cr |
ఈస్ట్ | 0.04 cr |
వెస్ట్ | 0.03 cr |
గుంటూరు | 0.05 cr |
కృష్ణా | 0.05 cr |
నెల్లూరు | 0.03 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.53 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.04 cr |
ఓవర్సీస్ | 0.04 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.61 cr |
‘మోసగాళ్ళు’ చిత్రాన్ని విష్ణు ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 20కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 0.61కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 19.39కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే ఫుల్ రన్లో అయినా ఈ చిత్రం కోటి కలెక్ట్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Click Here To Read Movie Review
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!