పెద్ద హీరోలు “ఫీల్” అయ్యారు!!!

సహజంగా టాలీవుడ్ లో ప్రతీ హీరోకు వారి రేంజ్ కు తగ్గట్టు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఏ హీరో గొప్ప అన్న టాపిక్ వచ్చినా..డిబేట్ జరిగిన…అభిమానులంతా తమ తమ అభిమాన హీరోలకు మద్దతుగా ఉంటారు. ఇదిలా ఉంటే… తాజాగా నేషనల్ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వే ఫలితాలు ప్రకటించింది. దాదాపుగా 25 మంది మోస్ట్ డిజైరబుల్ మెన్ తో  కూడిన ఈలిస్టులో అనేక సంచలనాలు ఉన్నాయి.  ఇంతకీ ఏంటో ఆ సంచలనాలు అంటే….ఈసర్వేలో ఎవ్వరూ ఊహించని విధంగా….సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిస్థానం దక్కించుకున్నాడు. అయితే గత సర్వేలో మహేష్ బాబు 2వ స్థానం ఉన్నాడు, అదే క్రమంలో మొదటి స్థానంలో రానా నిలిచాడు.

అయితే ఈసారి రానాను వెనక్కి నెట్టి మహేష్ బాబు నెం.1 పొజిషన్ దక్కించుకోగా రానా 5వ స్థానానికి పడిపోవడం విశేషం. ఇక ‘బాహుబలి’ సినిమాతో నేషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ సైతం తన గత సంవత్సరం 3వ స్థానం నుండి పడిపోయి 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక్కడ మరోక ఆసక్తికర విషయం ఏమిటంటే….ఎవ్వరూ ఊహించని విధంగా…అందరికీ షాక్ ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ లేకపోయినా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు 2వ స్థానం….స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 3వ లభించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంకో విషయం ఏమిటంటే….టైమ్స్ ప్రకటించిన  మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో నాగార్జునతో పాటు అతడి కొడుకులు నాగ చైతన్య అఖిల్ సైతం స్థానాలు సంపాదించడం హాట్ టాపిక్ గా మారింది. మరో పక్క టాలీవుడ్ ఎంపరర్ గా కోట్లాది మంది అభిమానులను పొందిన పవన్ కళ్యాణ్ కు పాపం ఈ టైమ్స్ ర్యాంకింగ్ లిస్టులో 7వ స్థానం మాత్రమే రావడం పవన్ అభిమానులకు షాక్ ఇచ్చే విషయం. వీళ్ళే కాకుండా…ఈ టైమ్స్ లిస్టులో యువ హీరోలు అయినటువంటి రాజ్ తరుణ్, నాని, శర్వానంద్, లు స్థానం సంపాదించడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఏది ఏమైనా…టైమ్స్ సర్వే హీరోల అభిమానుల్లో కలకలం రేపుతున్నట్లుగా ఉంది అన్న విమర్శలు సైతం వినిపించడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus