Akhil: అక్కడ కూడా హిట్టు కొట్టిన అఖిల్!

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు బాగానే లాభాలను అందించింది. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్ కు ముందు ఆహా నిర్వాహకులు ఈ సినిమాను భారీస్థాయిలో ప్రమోట్ చేశారు. అయితే ఓటీటీలో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అనిపించుకోవడం గమనార్హం.

ఆహా ఓటీటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రెండు రోజుల్లో ఏకంగా 100 మిలియన్ల నిమిషాల రన్ టైమ్ ను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూడటంలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. అఖిల్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నిలిచింది. పూజా హెగ్డే ఈ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో సక్సెస్ సాధించారు.

ఈ సినిమా సక్సెస్ తో అఖిల్ తర్వాత సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమాలో నటిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. అఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఏజెంట్ మూవీ తెరకెక్కుతుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus