టాలీవుడ్ లో పెళ్లికాని స్టార్ హీరోలు

  • April 28, 2017 / 09:14 AM IST

పెళ్లి మాట ఎత్తగానే అందరూ సంతోషిస్తారు. స్టార్ హీరోల పెళ్లి మాట అనగానే వారి ఫ్యాన్స్(అమ్మాయిలు) మాత్రం బాధపడతారు. గుండెపగిలేలా ఏడుస్తారు. బహుశా అందుకేనేమో మన టాలీవుడ్ యువ హీరోలు పెళ్లి ఊసు ఎత్తడంలేదు. నచ్చిన అమ్మాయి దొరకలేదో.. కెరీర్ లో గోల్స్ ఉన్నాయో తెలియదుకాని.. మూడు పదులు దాటిపోతున్నా పెళ్లి మాటను దాటవేస్తున్నారు. అలా బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పని హీరోలపై ఫోకస్…

ప్రభాస్ తెలుగు హీరోల్లో పెళ్లి ప్రస్తావన రాగానే గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. 37 సంవత్సరాల ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి పీటలు ఎక్కడానికి మొన్నటి వారికి బాహుబలిని సాకుగా చెప్పారు. ఇప్పుడు కాబోయే భార్యను వెత్తుక్కోకుండా మరో సినిమాను మొదలెట్టారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రభాస్? అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు.

తరుణ్ నువ్వేకావాలి చిత్రంతో అమ్మాయిల మనసు దోచుకున్న తరుణ్ … ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడినట్లు, పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాలేదు. విజయాలు లేక అవకాశాలు తగ్గిపోయిన ఈ హీరోకి 35 ఏళ్ళు నిండుతున్నాయి. మరి ఈ సమయంలోనైనా పెళ్లిచేసుకుంటాడని అనుకుంటున్నారు.

రానా హీరో నుంచి విలన్ గా.. విలన్ నుంచి హీరోగా నటనను నిరూపించుకుంటున్న దగ్గుబాటి రానా పెళ్లి కొడుకుగా ఎప్పుడు కనిపిస్తారా ? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్నీ రానాని అడిగితే .. ఇప్పుడే పెళ్లేంటి అని సమాధానం చెబుతున్నారు.

నితిన్ ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నితిన్ కనిపించే కుర్రోడేమి కాదు. ఆయన పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు నిండిపోయాయి. సో.. ఇంట్లో వాళ్ళు నితిన్ పెళ్ళికి ఎప్పుడు ఒకే చెబుతాడా? అని ఎదురుచూస్తున్నారు.

వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అలోచించి స్క్రిప్ట్ లను ఎంచుకొని ఓ స్టార్ గా ఎదుగుతున్నారు. రీసెంట్ గా మిస్టర్ గా వచ్చిన ఇతను ఫిదా మూవీ చేస్తున్నారు. తన అన్న రామ్ చరణ్ లాగా వరుణ్ ప్రేమ వివాహం చేసుకుంటాడా? లేకుంటే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటాడా ? అని మెగా ఫ్యామిలీ వెయిటింగ్ చేస్తోంది.

సాయి ధరమ్ తేజ్ దూకుడు ఎక్కువగా గల మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సినిమాలు వేగంగా చేయడమే కాదు.. ప్రేమలో పడడంలోనూ స్పీడే. తోటీ హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తున్నారని తేజుపై ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. పెళ్లి ఓకే చెప్పి వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతాడో చూడాలి.

శర్వానంద్ ఎటువంటి లవ్ రూమర్స్ రాకుండా కెరీర్ ని నడిపిస్తున్న హీరో శర్వానంద్. అందగాడైన ఈ హీరోని పెళ్లి చేసుకొనే అదృష్టవంతురాలు ఎవరా? అని తెలుగు అమ్మాయిలు ఎదురుచూస్తున్నారు. రాధా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న శర్వానంద్ మనసులోని రాధని ఎప్పుడు బయటపెడుతారు.

రామ్ పోతినేని దేవదాస్ సినిమాతో రామ్ అనేకమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. చాకోలెట్ బాయ్ గా ముద్దొచ్చే ఈ హీరో వయసు కూడా మూడు పదులు దాటిపోయింది. అయినా బ్యాచిలర్ లైఫ్ ని వీడనంటున్నాడు.

నిఖిల్ ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా నిఖిల్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ హైదరాబాద్ కుర్రోడు సినిమాకి సినిమాకి గ్లామర్ పెంచుకుంటూ అమ్మాయిలకు నిద్రలేకుండా చేస్తున్నాడు. వారు ప్రశాంతంగా నిద్రపోవడానికైనా నిఖిల్ పెళ్లి ప్రస్తావన తీసుకురావాలి.

సందీప్ కిషన్ విభిన్నమైన కథలకు ఎంచుకుంటూ.. చిన్న, పెద్ద సినిమాలు అని తేడాలేకుండా నటిస్తూ కెరీర్ ని హిట్ ట్రాక్ లోనే సందీప్ కిషన్ నడిపిస్తున్నాడు. తాను మాత్రం బ్యాచిలర్ ట్రాక్ లోనే వెళుతున్నాడు. ఈ ట్రాక్ ని బ్రేక్ చేసి.. పెళ్లి ట్రాక్ కి తొందర్లోనే వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. నిజ జీవితంలో పెళ్లి చూపులు ఇప్పట్లో చూసేలా కనిపించడంలేదు. ఎందుకంటే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ యువ హీరోని పెళ్లిపీటలపైకి లాక్కొని పోయే సుందరి ఎక్కడుందో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus