బిగ్ బాస్ హౌస్ లో ప్రతిరోజూ మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా చిన్న టాస్క్ ఆడతారు హౌస్ మేట్స్ అందరూ. ఇందులో ఈసారి మోస్ట్ ఇరిటేటింగ్ ఎవరో చెప్పమని బిగ్ బాస్ చెప్పాడు. అంతేకాదు, వాళ్లకి ఫ్లాగ్ ఇస్తూ తగిన కారణాలు చెప్పాలి. ఇక్కడే హౌస్ మేట్స్ లో మెజారిటీ ఓట్లు మిత్రా శర్మాకి పడ్డాయి. అందరూ కూడా నామినేషన్స్ అప్పుడు మిత్రా ప్రవర్తించిన తీరుని తప్పుబట్టారు. అంతేకాదు, నువ్వు చాలాసేపు మాట్లాడావ్ అని, కాళ్లు అన్నీ నొప్పులు పుట్టాయని చెప్పారు.
దీంతో మిత్రా శర్మా దాన్ని చాలా లైట్ తీస్కుంది. అంతమంది పైయిన్ తో ఇరిటేటింగ్ అని ఇస్తుంటే, ఇది నేను పాజిటివ్ గా తీస్కుంటున్నా అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక తిక్కరేగిన అరియానా, ప్రతిదీ పాజిటివ్ నోట్ లో ఎలా తీస్కుంటావని, ఇంతమందిని ఇరిటేట్ చేస్తున్నావంటే దీన్ని సీరియస్ గా తీస్కుని గేమ్ లో ముందుకెళ్లాలని, గేమ్ పరంగా ఖచ్చితంగా మార్చుకోవాలని హితవు చెప్పింది. అంతేకాదు, గేమ్ లో సీరియస్ నెస్ లేకుండా ఇలా చేయద్దని మిత్రాకి చిన్నసైజ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
నీకోసం ఫైట్ చేయమని స్టాండ్ తీస్కోమని చెప్పింది. నిజానికి నామినేషన్స్ అప్పుడు కూడా మిత్రా చేష్టలకి అరియానాకి నవ్వు వస్తున్నా కూడా మిగతా హౌస్ మేట్స్ ని అలర్ట్ చేసింది. ఇది నామినేషన్ ప్రక్రియ అని సీరియస్ గా తీస్కోవాలని చెప్పింది. అప్పుడే మిత్రా తనకి వేసిన ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ, శివని నామినేట్ చేస్తూ రీజన్ కరెక్ట్ గా ఇవ్వలేకపోయింది మిత్రా. మిత్రా శర్మా మాటలకి ఇంట్లో వాళ్లు అందరూ ఖంగు తింటున్నారు. సంబంధం లేకుండా మాట్లాడటం, ఎక్సైట్ అయిపోయి మాట్లాడటం , హైపర్ అయిపోవడం మిత్రా చేస్తుంటుంది
. ఇక టాస్క్ లలో కూడా మిత్రా సరైనా ఆడతీరు అనేది ఇంతవరకూ ఆడియన్స్ చూడలేదు. అందుకే, అరియానా నీకోసం నువ్వు ఫైట్ చేయి అని , నీకోసం గేమ్ ఆడమని హితవు చెప్పింది.లాస్ట్ టైమ్ మిత్రా శర్మా వరెస్ట్ పెర్ఫామర్ అని జైలుకి వెళ్లిన తర్వాత అరియానా తనపై జాలి చూపించింది. అంతేకాదు, కోర్టులో అంతరూ కార్నర్ చేసినపుడు మిత్రా ఏడుస్తుంటే ఓదార్చింది. అన్నం కూడా తినిపించింది. కానీ, మిత్రా శర్మా మాత్రం ఒకరి గురించి ఇంకొకరికి చెప్తూ తన మెడకి ఉచ్చుని తానే బిగించుకుంటోంది. అదీ మేటర్.