24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన 10 సౌత్ సినిమాల హిందీ ట్రైలర్లు..!

హిందీ ప్రేక్షకులు మాత్రమే కాదు అక్కడి మేకర్స్ చూపు కూడా మన సౌత్ సినిమాల పైనే ఉంది. అక్కడి సినిమాల్లో ఏమి లోపించిందో తెలీదు కానీ.. సౌత్ లో అంతంత మాత్రమే ఉండే సినిమాలను కూడా వాళ్ళు తెగ చూస్తున్నారు. ‘బాహుబలి’ ‘కె.జి.ఎఫ్’ ల పుణ్యమా అని మన సౌత్ హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ కూడా నార్తె. ప్రధానంగా హిందీ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి.. అక్కడ కనుక సినిమాకి మంచి టాక్ వస్తే.. భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంటుంది.

ఇటీవల విడుదలైన ‘పుష్ప’ ని దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ చూపు మన రవితేజ ‘ఖిలాడి’ పై కూడా పడింది. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ కు అక్కడ విశేషదారణ దక్కుతుంది. చూస్తుంటే ఈ సినిమాకి అక్కడ మంచి ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ‘ఖిలాడి’ మాత్రమే కాదు గతంలో కూడా కొన్ని సౌత్ సినిమాల హిందీ ట్రైలర్లు 24 గంటల్లో రికార్డుల మోత మోగించాయి. అందులో టాప్ 10 ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సాహో : ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుండీ వచ్చిన ఈ మూవీ హిందీ ట్రైలర్ కు 24 గంటల్లో 31.65 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

2) రాధే శ్యామ్ : ‘సాహో’ అంత కాదు కానీ ‘రాధే శ్యామ్’ హిందీ ట్రైలర్ కు 24 గంటల్లో 28.08 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

3) ఆర్.ఆర్.ఆర్ : రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్.. కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ కు 24గంటల్లో 19.7 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

4) బాహుబలి2 : రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ హిందీ ట్రైలర్ కు 24 గంటల్లో 11.2 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

5) 2.ఓ : రజినీకాంత్- శంకర్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ హిందీ ట్రైలర్ కు 24 గంటల్లో 10.6 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

6) దర్బార్ : రజినీకాంత్- మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ హిందీ ట్రైలర్ కు 24 గంటల్లో 10.6 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

7) ఖిలాడి : రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ హిందీ ట్రైలర్ కు 24 గంటల్లో 6.93 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

8) సైరా : చిరంజీవి- సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ హిందీ ట్రైలర్ కు 24 గంటల్లో 6.2 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

9) కె.జి.ఎఫ్ చాప్టర్ 1 : యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ హిందీ ట్రైలర్ కు 24 గంటల్లో 5.9 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

10) పుష్ప : అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ హిందీ ట్రైలర్ కు 24 గంటల్లో 5.77 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus