Mouna Poratam: 30 ఏళ్ళ తర్వాత ‘మౌన పోరాటం’ సినిమాకి సీక్వెల్ ఇలా ప్లాన్ చేశారట!

‘అమృతం’ అనే సీరియల్ టీవీల్లో సంచలనాలు క్రియేట్ చేసిన తర్వాత సీక్వెల్ ను సినిమాగా రూపొందించారు. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు ఓ సినిమాకి సీక్వెల్ గా సీరియల్ ను రూపొందించారు. ఏప్రిల్ 4 నుండీ ‘మౌనపోరాటం’ అనే సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ కానుంది. నిజానికి ఇది ఓ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అని బహుశా చాలా మందికి తెలిసుండదు. అడవిలో స్వేచ్ఛగా, స్వచ్ఛమైన మనసు కలిగిన ఓ గిరిజన యువతిని,ఓ పెద్ద ఉద్యోగి ప్రేమ పేరుతో మోసం చేస్తే…

Click Here To Watch NOW

అతని కారణంగా గర్భం దాల్చిన ఆ గిరిజన యువతి, కడుపులోని బిడ్డకు తండ్రెవరో నిరూపించుకోవాల్సిన దయనీయ దుస్థితి ఎదుర్కొంటుంది.ఆ ఒంటరి యువతి జీవన ప్రయాణం చివరికి ఏమైంది అనే కథాంశంతో రూపొందిన చిత్రమే ఈ ‘మౌన పోరాటం’. ఆ రోజుల్లో ఓ మంచి సందేశాత్మకంగా చిత్రంగా నిలిచింది.ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ మూవీలో గిరిజన యువతిగా యమున ,ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసే పెద్ద ఉద్యోగిగా వినోద్ కుమార్ నటించారు.

రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయని ఎస్.జానకి సంగీతం అందించగా, మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు.1989లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 30 ఏళ్ళ తర్వాత ‘మౌన పోరాటం’ చిత్రానికి సీక్వెల్ గా అదే పేరుతో ఓ డైలీ సీరియల్ ఈటీవీలో ప్రసారం కాబోతుండడం విశేషం. గిరిజన యువతి అయిన ‘దుర్గ’ …కష్టపడి చదివి ఎలా ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. కన్నబిడ్డ దూరమైనా, పేగుబంధం ప్రశ్నార్ధకమైనా… నమ్మిన విలువల కోసం ఆమె ఎలా ఉద్యమించింది? అనే థీమ్ తో ఈ సీరియల్ ను రూపొందించారు.

యమున, సెల్వరాజ్, మనోజ్, బాబీ, వర్షిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరియల్ కు ‘జై’ దర్శకత్వం వహించారు.ఇప్పటి పరిస్థితులకు తగినట్లుగా ఈ సీరియల్ ను ఎలా రూపొందించారు..? సినిమా చూడని వాళ్ళకి ఈ సీరియల్ ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాలానే సీరియల్ కూడా సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి..!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus