Pawan Kalyan: అభిమానికి భారీ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పవన్ సినిమా థియేటర్లలో రిలీజైతే కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ కావాల్సిందేనని చెప్పవచ్చు. జనసేన పార్టీ తరపున పవన్ నిర్వహించే సభలకు లక్షల సంఖ్యలో జనం హాజరవుతున్నారంటే పవన్ పై ప్రజల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందో సులభంగానే అర్థమవుతుంది. ఎప్పటికైనా ఏపీకి సీఎం కావాలని పవన్ ఎంతో కష్టపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ లేడీ ఫ్యాన్ ఒకరు తనకు చేతులు లేకపోయినా పవన్ బొమ్మలు వేయగా ఆ బొమ్మలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

మౌత్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న స్వప్నిక నోటితోనే పవన్ బొమ్మ వేసి ఆ ఫోటోల ద్వారా పవన్ ఫ్యాన్స్ చేత చెల్లి అని పిలిపించుకుంటున్నారు. స్వప్నిక ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన యువతి కాగా ఆమె వేసిన డ్రాయింగ్స్ పవన్ దృష్టికి రావడంతో పవన్ ఆమెను కలుస్తానని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. గతంలో కలుస్తానని మాట ఇచ్చిన పవన్ ఆ మాటను నిలబెట్టుకున్నారు. వైజాగ్ కు వెళ్లిన పవన్ స్వప్నికను కలవడంతో పాటు ఆమె లైఫ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు.

స్వప్నిక ఇచ్చిన సరికొత్త డ్రాయింగ్ ను పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా తీసుకున్నారు. వైజాగ్ లో పవన్ అన్నయ్యను కలిశానంటూ స్వప్నిక సోషల్ మీడియాలో షేర్ చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. లేడీ ఫ్యాన్ ను కలిసి పవన్ ఆ అభిమానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus