కొత్త సినిమా మొదలవుతోంది అంటే అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. వీలైనంత త్వరగా షెడ్యూల్ పూర్తి చేసుకుని ఆ ఫుటేజ్ నుండి ఏదో ఒక స్పెషల్ స్టఫ్ కావాలి అని కోరుతుంటారు. ఈ మధ్య సినిమా టీమ్‌లు కూడ ఇదే పని చేస్తున్నాయి. అయితే తొలి షెడ్యూల్ యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభిస్తే సరైన స్టిల్స్ రాకపోవచ్చు. ఇప్పుడు ఈ విషయం చర్చ ఎందుకు అంటున్నారా? ఎందుకంటే యాక్షన్ సన్నివేశాలే తొలి సెషన్‌లో ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్య.
అగ్ర హీరోలు ఎక్కువగా ఈ తరహా షూటింగ్‌లకు సిద్ధమవుతున్నారు. నగరంలో పెద్ద సెట్స్ వేయడం, వాటిల్లో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ల నేతృత్వంలో ఆ ఫైట్ సన్నివేశాల చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు. అలా ప్రారంభించిన, ప్రారంభించబోయే, గతంలో చేసిన కొన్ని సినిమాల సంగతి చూద్దాం. సెట్స్ లేకుండా, యాక్షన్ సన్నివేశాలు లేకుండా సినిమాలు రూపొందడం లేదు అనేది అబద్దం. ఎందుకంటే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. వీళ్లిద్దరి కలయికలో వస్తున్న ఈ నాలుగో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. లాంఛనంగా మొదలైన ఈ సినిమా రీ యాక్షన్ సీక్వెన్స్‌తో తొలి షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఇక కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్‌ను అనుకుంటున్నారు. ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ లాంటి హిట్ల తర్వాత రవితేజ నుండి వస్తోంది.
ఇక చిరంజీవి కొత్త సినిమాని (Movie) నెలాఖరున పోరాట ఘట్టాలతో చిత్రీకరణ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి సరసన అనుష్క పేరు మాత్రమే వినిపించింది. ఆమె కాకుండా బాలీవుడ్ హీరోయిన్ కూడా ఉండొచ్చు అని చెబుతున్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉంది. బాలకృష్ణ – బాబీ సినిమాను కూడా ఇలా యాక్షన్ సీన్‌తో ప్రారంభించారు. ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ సమయంలోనూ ఇలా చేశారు.