2023 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది.. ఇన్నాళ్లూ కోవిడ్ కారణంగా నష్టాలు ఎదుర్కొన్న సినీ పరిశ్రమలో.. పాండమిక్ తర్వాత రిలీజ్ క్లాషెస్ చాలానే వచ్చాయి.. కానీ ఇప్పుడు మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది.. తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి అనేది చాలా పెద్ద సీజన్.. భోగి, సంక్రాంతి, కనుమ..ఇలా మూడు రోజులూ.. లేదా, ఒకటి, రెండు రోజుల ముందుగానో సినిమాలు రిలీజ్ చేసేవారు.. పండుగ సీజన్ కాబట్టి మూడు, నాలుగు సినిమాలు వచ్చినా ప్రేక్షకాభిమానులు థియేటర్లకు పోటెత్తేవారు..
ఆ సందడితో హాళ్లన్నీ జాతరను తలపించేవి.. అయితే ఇది ఒకప్పటి లెక్క.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సరైన స్క్రీన్స్ లేవు.. పాండమిక్ కారణంగా పలు హాళ్లు మూతపడ్డాయి.. ఏపీలో రకరకాల కారణాలతో కొన్ని థియేటర్లు క్లోజ్ చేసిన సంఘటనలు చూశాం.. ప్రస్తుతం టాలీవుడ్ లో విడుదల చెయ్యడానికి సినిమాలైతే ఉన్నాయి కానీ.. వాటిని ప్రదర్శించడానికి థియేటర్లే దొరకడం లేదు.. పైగా ఎవరూ వెనక్కి తగ్గట్లేదు సరికదా.. సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకుంటామంటూ మొండిగా పొంగల్ రిలీజ్ అంటూ పోస్టర్స్ వదులుతున్నారు.
ఇక ఇప్పటివరకు వచ్చే సంక్రాంతికి షెడ్యూల్ చేసుకుంటున్న సినిమాల సంగతి చూస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ’ఆదిపురుష్‘ జనవరి 12న వస్తుందని ముందే అనౌన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికే అన్నారు కానీ ఇంతలో బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ అనౌన్స్ చెయ్యడంతో.. రెండు సినిమాలకు మైత్రీ వాళ్లే నిర్మాతలు కాబట్టి చిరు మూవీ రాకపోవచ్చు అనుకున్నారు..
కట్ చేస్తే సంక్రాంతికే సినిమా వస్తుందని కన్ఫమ్ చేసేశారు. ఆ తర్వాత దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ‘వారసుడు’ కూడా సంక్రాంతికే కర్చీఫ్ వేసుకుంది. ఇంతలో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ చిత్రం పెద్ద పండక్కే వస్తుందని అనౌన్స్ చేశారు. ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’ రెండూ జనవరి 11, ‘ఆదిపురుష్’, ‘వీర సింహా రెడ్డి’ రెండూ జనవరి 12న రానున్నాయని సమాచారం. మధ్యలో మరో రోజు లేదు కాబట్టి అఖిల్ ఏ డేట్ కి వస్తాడనే విషయంలో క్లారిటీ లేదు..
ఒకేసారి ఐదు సినిమాలొస్తున్నాయి.. థియేటర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులొస్తాయి అనడిగితే.. ‘‘మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అన్న చందాన సినిమాలు ఎక్కువైతే థియేటర్లు ఎక్కడ దొరుకుతాయి?.. హీరోలు, నిర్మాతలు బాగానే ఉంటారు.. మరి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పరిస్థితి గురించి పట్టించుకోరా?’’ అంటూ పంపిణీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!