సంక్రాంతి పండగ ముగిసింది.. మళ్ళీ రేపు సినిమా పండగ మొదలవ్వనుంది. అయితే.. సంక్రాంతికి రిలీజైన సినిమాలు ఆల్రెడీ థియేటర్లు భారీ స్థాయిలో కబ్జా చేసి ఉండడంతో.. ఈవారం చెప్పుకోదగ్గ స్థాయిలో తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. రెండు చిన్న సినిమాలు మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. “ఇగో, హార్ట్ బీట్” చిత్రాలు రేపు విడుదలవుతున్నాయి. “ఇగో” రెగ్యులర్ లవ్ స్టోరీ కాగా.. “హార్ట్ బీట్” మాత్రం ఓ చిన్న పిల్ల ఒక పెద్దబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ లో తెరకెక్కింది. ఇక హిందీలో ఈవారం మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలున్నాయి.. “నిర్ధోష్” అనే ఫస్ట్ ఇండియన్ సస్పెక్ట్ థ్రిల్లర్ తోపాటు “వోడ్కా డైరీస్” అనే థ్రిల్లర్ కూడా రేపు రిలీజవుతుంది. రెండు సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి.
అలాగే.. ఈవారం హాలీవుడ్ నుంచి ఏకంగా 3 మంచి సినిమాలు రిలీజ్ ఉండడం విశేషం. వాటిలో ముఖ్యమైనది యాక్షన్ థ్రిల్లర్ “ది కమ్యూటర్”. కేవలం ఒకరోజులో ఒక ట్రైన్ లో జరిగే కథతో ఈ సినిమా నడుస్తుంది. లియామ్ నేసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అలాగే.. “12 స్ట్రాంగ్” అనే అమెరికన్ సోల్జర్ ఫిలిమ్ కూడా రిలీజవుతుంది. అమెరికాపై ఇరాక్ దాడి అనంతరం అమెరికన్ సోల్జర్స్ జరిపిన మొట్టమొదటి యుద్ధం నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి. అదే విధంగా.. “డౌన్ సైజింగ్” అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ కూడా రేపు రిలీజవుతుంది. పెరిగిపోతున్న జనాభా కారణంగా.. భూమిపై బరువు తగ్గించడం కోసం మనుషుల్ని 5 సెంటీమీటర్ల సైజుకి కుదించి వారికంటూ ప్రత్యేకమైన నివాసం ఏర్పరుస్తారు. అక్కడ ఆ లిల్లీపుట్ సైజ్ మనుషుల ఎలా జీవించారు అనేది సినిమా కాన్సెప్ట్. ఈ విధంగా ఈ శుక్రవారం రెండు తెలుగు, రెండు హిందీ, మూడు ఇంగ్లీష్ సినిమాలు మూవీ లవర్స్ కోసం థియేటర్లలో వెయిట్ చేస్తున్నాయి.