ఒకవారం అసలు చూడ్డానికి సినిమాలే ఉండవు, ఒక్కోసారేమో వారం మొత్తం చేసినా సరిపోనన్ని సినిమాలుంటాయి. ప్రస్తుతం మన రెగ్యులర్ సినిమా గోయర్స్ ఫేస్ చేస్తున్నది సెకండ్ ప్రోబ్లమ్. ప్రతివారం మహా మూడో నాలుగో సినిమాలు చూసేసి టైమ్ పాస్ చేసే మనోళ్ళకి ఈవారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదలకానుండడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఆగస్ట్ 24న తెలుగులో “వివేకం” అనే డబ్బింగ్ సినిమా విడుదలవుతోంది. అజిత్ కథానాయకుడిగా నటించిన ఈ హై బడ్జెట్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. అలాగే.. ఆగస్ట్ 25న విజయ్ దేవరకొండ మోస్ట్ హైప్డ్ మూవీ “అర్జున్ రెడ్డి”, మరో తమిళ డబ్బింగ్ సినిమా “విఐపి 2” చిత్రాలు విడుదలకానున్నాయి. హిందీలో నవాజుద్దీన్ సిద్దిఖీ “బాబూమోషాయ్ బందుక్ బాజ్”తోపాటు సిద్దార్ధ మల్హోత్రా నటించిన “ఎ జెంటిల్మన్” మరియు “స్నిఫ్” అనే మరో సినిమా కూడా విడుదలకానుంది. ఈ మూడ్ హిందీ సినిమాలపై కూడా భారీ అంచనాలున్నాయి.
వీటితోపాటు “ది హిట్ మ్యాన్స్ బాడీగార్డ్” అనే ఇంగ్లీష్ యాక్షన్ మూవీ రిలీజ్ కూడా ఉంది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కి బాడీగార్డ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది సినిమా కాన్సెప్ట్. సో, ఇన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఒకే వారం విడుదలవుతుండడంతో.. సదరు సినిమాలన్నీ చూడడం కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తూనే.. ఆ సినిమాల టికెట్స్ కోసం బ్యాంక్ బ్ల్యాలెన్స్ లు చెక్ చేసుకొంటున్నారట!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.