డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

  • November 26, 2022 / 08:00 AM IST

2022 ఒకటి గట్టిగా ప్రూవ్ చేసింది.అది సినిమాల విషయంలో..! అదేంటంటే ఈ ఏడాది ప్రేక్షకులు ధియేటర్ కు రావడం బాగా తగ్గించేశారు. ఎందుకంటే కచ్చితంగా ఎవ్వరి దగ్గర ఆన్సర్ లేదు. చాలా మంది మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే జనాలు ధియేటర్ కు వస్తున్నారు అంటూ చెబుతున్నారు. కానీ వాస్తవానికి చెప్పుకోవాలి అంటే ఏ సినిమా అయితే ప్రమోషనల్ కంటెంట్ తో జనాలను ఆకట్టుకుందో .. ఆ సినిమా చూడటానికి జనాలు ధియేటర్ కు వచ్చారు అన్నది వాస్తవం. అందుకే పెద్ద సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. కొన్ని పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా బ్రేక్ ఈవెన్ కానీ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇదే సమయంలో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు పెద్ద హిట్లుగా నిలిచాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి:

1) డీజే టిల్లు :

చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. రవితేజ వంటి పెద్ద హీరో సినిమా ఖిలాడి ఉన్నప్పటికీ ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2) విక్రమ్ :

కమల్ హాసన్ కి ఈ మూవీకి ముందు ఒక్క హిట్టు కూడా లేదు. లోకేష్ కనగ రాజ్ కూడా మాస్టర్ మూవీతో డిజప్పాయింట్ చేయడంతో ఈ మూవీ పై మొదట అంచనాలు లేవు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

3) కార్తికేయ :

ఈ మూవీ రిలీజ్ కు చాలా కష్టపడింది. పైగా నిర్మాతలు ఎక్కువ బడ్జెట్ పెట్టారు.నిఖిల్ కూడా ఈ మూవీ రిలీజ్ కాదేమో అని భయపడుతున్నట్టు… చెప్పి బాధపడ్డ సందర్భం ఉంది.మొత్తానికి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగుతో పాటు హిందీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

4) బింబిసార :

కళ్యాణ్ రామ్ మార్కెట్ కు డబుల్ బడ్జెట్ పెట్టి చేసిన ఈ మూవీ పై మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ మూవీ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరి నోర్లు మూయించింది అని చెప్పొచ్చు.

5) సీతా రామం :

దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ రాకూర్ హీరోయిన్ గా రష్మిక కీలక పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ పై కూడా మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే దర్శకుడు హను రాఘవపూడికి అప్పటి వరకు సాలిడ్ లేదు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

6) విక్రాంత్ రోణ :

కన్నడ స్టార్ హీరో సుదీప్ హీరోగా నటించిన ఈ మూవీ ఎంత సక్క అనే ఒక్క పాటతో ప్రేక్షకులను ధియేటర్ కు రప్పించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7) తిరు:

ధనుష్ నటించిన ఈ మూవీ కూడా సైలెంట్ గా బ్లాక్ బస్టర్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కొట్టింది.

8) లవ్ టుడే :

తమిళ్ లో చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ.

9) కాంతార :

కన్నడలో మొదట రిలీజ్ అయ్యి హిట్ అయిన ఈ మూవీ.. తెలుగులో కూడా 10 రెట్లు ప్రాఫిట్స్ ను అందించింది. వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

10) మసూద :

ఇది కూడా చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది. సినిమా చూశాక పెట్టిన టికెట్ రేటుకి వంద శాతం న్యాయం చేసిన మూవీ ఇదని ప్రూవ్ చేసింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus