ఈ 10 సినిమాలకు ఫ్రాంచైజీలు ప్లాన్ చేసే ఛాన్స్ ఉందట..!

ఫ్రాంచైజీ మూవీస్ కు బాలీవుడ్ పెట్టింది పేరు. కానీ మెల్లమెల్లగా అది టాలీవుడ్ కు కూడా పాకింది. ‘ఎఫ్2’ ఫ్రాంచైజీలో భాగంగా ‘ఎఫ్3’ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు ‘హిట్’ యూనివర్స్ లో భాగంగా ‘హిట్2’ కూడా వచ్చింది. ఇవి మాత్రమే కాదు ఇంకా కొన్ని సినిమాలు ఫ్రాంచైజీల్లో భాగంగా వచ్చాయి. ఇక్కడ ఫ్రాంచైజీ అంటే సీక్వెల్ అనే చెప్పలేము. కేవలం ఒరిజినల్ లోని పాత్రలను తీసుకుని.. ఇంకో కొత్త కథని చెప్పడం. దాదాపు మొదటి పార్ట్ లో వచ్చిన నటీనటులే మిగిలిన భాగాల్లో కూడా కనిపిస్తారన్న మాట.ఫ్రాంచైజీల్లో భాగంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి.మరి ఇప్పటివరకు ఫ్రాంచైజీల్లో భాగంగా వచ్చిన సినిమాలు.. రాబోయే సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) హిట్ – హిట్ 2 – హిట్ 3 :

‘హిట్’ లో విశ్వక్ సేన్ నటించాడు. ‘హిట్2’ లో అడివి శేష్ నటించాడు ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. ‘హిట్ 2’ చివర్లో ‘హిట్ 3’ హీరో నాని అని చూపించేశాడు దర్శకుడు శైలేష్ కొలను. మొత్తం 7 కేసులు ఉంటాయని తెలుస్తుంది. మిగతా నలుగురు హీరోలు ఎవరో తెలియాల్సి ఉంది.

2) ఎఫ్2 – ఎఫ్ 3- ఎఫ్ 4 :

వెంకటేష్- వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్2’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది ‘ఎఫ్3’ కూడా వచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. ‘ఎఫ్4’ కూడా ఉంటుంది అని రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు.

3) బింబిసార – బింబిసార2 :

‘బింబిసార’ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీని ఫ్రాంచైజీల్లో భాగంగా 5 కథలు ఉంటాయని టీం చెప్పింది. ‘బింబిసార2’ లో ఎన్టీఆర్ ను నటింపజేసే ఛాన్స్ ఉన్నట్టు టీం హింట్ ఇచ్చింది.

4) కార్తికేయ – కార్తికేయ 2 :

కార్తికేయ లో స్నేక్ హిప్నటైజేషన్ గురించి ప్రధానంగా చూపించారు. పార్ట్ 2 లో కృష్ణుడు పాలించిన ద్వారకా నగరం గురించి చెప్పారు. కార్తికేయ 3.. విదేశాల నేపథ్యంలో ఉండబోతుంది అని హింట్ ఇచ్చారు.

5) గూఢచారి – గూఢచారి 2 :

అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ‘గూఢచారి2’ ‘గూఢచారి3’ కథలను కూడా సిద్ధం చేసుకునే పనిలో శేష్ ఉన్నాడు.

6) దృశ్యం -దృశ్యం2- దృశ్యం 3:

‘దృశ్యం2’ రెండో భాగం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవ్వడం పట్ల వెంకీ అభిమానులు కొంత నిరాశ చెందారు. అయితే దృశ్యం3 కూడా ఉంటుందని ఈసారి గడ్డం మెరిసిపోయినట్టు, కూతుర్లు పెళ్లీడు కొచ్చినట్టు చూపిస్తారని వెంకీ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. ‘దృశ్యం’ ఫ్రాంచైజీని 5 కథలుగా చెప్పాలనేది టీం ప్లాన్.

7) రోబో – 2.ఓ :

రోబో చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దీనిని కూడా ఫ్రాంచైజీగా రూపొందించాలి అని శంకర్ ప్లాన్ చేశారు. రెండో కథ 2.ఓ పేరుతో వచ్చింది. మరో పార్ట్ కూడా ఉంటుందని శంకర్ హిట్ ఇచ్చేశారు.

8) ఆర్య : ఆర్య2 : ఆర్య 3 :

‘ఆర్య’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘ఆర్య2’ యావరేజ్ గా ఆడింది. ‘ఆర్య3’ కూడా ఉంటుందని సుకుమార్ చాలా సార్లు చెప్పారు. అతని వద్ద కథ కూడా రెడీగా ఉందని కానీ టైటిల్ మాత్రం ‘ఆర్య3’ అని పెట్టను అని ఆయన చెప్పారు.

9) ‘అ!’ :

‘అ!’ ఫ్రాంచైజీల్లో భాగంగా 3 కథలు చెప్పాలని ప్రశాంత్ వర్మ కథలు రాసుకున్నాడు. కానీ ఎప్పుడు ఈ ప్రాజెక్టు సెట్ అవుతుందో మరి..!

10) పుష్ప – పుష్ప 2 – పుష్ప 3:

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప2’ తో పాటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని. .. దాన్ని పాన్ వరల్డ్ మూవీగా చేయాలన్నది సుకుమార్ డ్రీం.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus