కొన్నేళ్ల క్రితం తెలుగు సినిమా అనగానే మన ప్రాంతాల్లోనే ఎక్కువగా చిత్రీకరించేవారు. పాటల కోసం విదేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు రిచ్ నెస్ పేరుతో దాదాపు కథ సగభాగం విదేశాల్లో షూట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య ట్రెండ్ మారింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలు సూపర్ హిట్ అవుతున్నారు. అందుకే దర్శకనిర్మాతలు పల్లెబాట పడుతున్నారు. రీసెంట్ గా పల్లెటూరిలో రూపుదిద్దుకొని హిట్ సాధించిన సినిమాలపై ఫోకస్..
1. రంగస్థలం 1980 కాలంలో గోదావరి జిల్లాలో జరిగే ఓ అందమైన కథ రంగస్థలం. ఈ స్టోరీ ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మరింత అందంగా సుకుమార్ తెరకెక్కించారు. రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భారీ కలక్షన్స్ రాబడుతోంది.
2. సోగ్గాడే చిన్ని నాయన కింగ్ నాగార్జున హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయన చిత్రాన్ని మైసూర్, రాజముండ్రిలో చిత్రీకరించారు. 1500 ఏళ్ళ క్రితం నటి విష్ణు ఆలయం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
3. శతమానం భవతి వరి చేలు, కొబ్బరి తోటలు.. చేపల చెరువులు ఇలా శతమానం భవతి సినిమాలో ‘కోనసీమ’ అందాలని
డైరక్టర్ సతీష్ వేగేశ్నబాగా చూపించారు.
4. బృందావనం ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కలయికలో రూపుదిద్దుకున్న బృందావనం కూడా గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టింది.
5. శ్రీమంతుడు కొరటాల శివ ఈ సినిమాని తమిళనాడు పొల్లాచిలో ఎక్కువ భాగం తీశారు. అక్కడి ఊరి సెట్.. మామిడి తోట.. ప్రతి ఒక్కరికి తమ సొంతూరిని గుర్తుకు తెచ్చింది.
6. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గోదావరి జిల్లాల్లో రూపుదిద్దుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ అక్కడి అందాలని, అనుబంధాల్ని గుర్తుకుతెచ్చింది.
7. అ ఆ తెలుగు వారి ఆత్మీయతను, అనురాగాలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించే త్రివిక్రమ్ శ్రీనివాస్ అ ఆ సినిమాలో పశ్చిమ గోదావరి జిల్లాలోని కలవపూడి అందాలను చక్కగా చూపించారు.
8. చందమామ సినిమాల లొకేషన్స్, కథల కోసం ఇంగ్లిష్ సినిమాలను చూడాల్సిన అవసరం లేదని, మన చుట్టూ ఉన్న ప్రాంతాలను, వ్యక్తులను గమనిస్తే సరిపోతుందని కృష్ణవంశీ చందమామ సినిమాతో చెప్పారు.
9. గోవిందుడు అందరివాడేలేఆంధ్రలోని పల్లెటూరిలో ఎక్కువభాగం తీసిన మూవీ గోవిందుడు అందరివాడేలే. ఉమ్మడి కుటుంబాల్లోని బంధాలను బలంగా చూపించారు.
10. మురారి తెలుగు వారి పండుగలు, నమ్మకాలూ, ప్రేమలు, పట్టింపులు.. వీటన్నిటిని కలిపి కృష్ణవంశీ అందించిన మూవీ మురారి. ఈ సినిమా తెలుగువారి మనసుకు హత్తుకుంది.
11. ఉయ్యాలా జంపాల ఒక చిన్న గ్రామంలో జరిగిన చిన్న ప్రేమకథ ఉయ్యాలా జంపాల. ఆ అందమైన ఊరు దాటకుండానే సినిమా తీసి కలెక్షన్లు కోట్లు దాటించారు.
12. గోదావరి గోదావరి, పాపికొండలు అందాలను శేఖర్ కమ్ముల మరింతబాగా గోదావరి సినిమాలో చూపించారు. బాగా రీసెర్చ్ చేసి తీసిన ఈ మూవీ ప్రకృతి ప్రేమికుల లైబ్రరీలో ఉండాల్సిందే.
13. ఫిదా
తెలంగాణలోని పల్లెటూరిలో పుట్టి పెరిగే అమ్మాయి చుట్టూ జరిగే కథ ఫిదా. కొంత భాగం విదేశాల్లో షాట్ చేసుకున్నప్పటికీ ఫిదా సూపర్ హిట్ అయింది.
ఈ జాబితాలోకి వచ్చే సినిమాలను మేము మిస్ చేసి ఉంటే.. కామెంట్ చేయండి.