టాలీవుడ్ బాగా నమ్ముకునే సీజన్ ఒకటి సంక్రాంతి అయితే… రెండోది సమ్మర్. అందుకే ఎక్కువగా ఆ సమయాల్లో సినిమాలు విడుదల చేస్తుంటారు. వారానికో సినిమా, మహా అయితే రెండు సినిమాలు విడుదల చేసే టాలీవుడ్… ఆ రోజుల్లో మాత్రం ఎక్కువ సినిమాలు విడుదల చేస్తుంటారు. సంక్రాంతి సీజన్ సినిమాలేంటో తేలిపోయి, విడుదలకు సిద్ధమైపోయిన నేపథ్యంలో సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలేంటి. అయితే ఇప్పుడు అనుకున్న సినిమాలన్నీ అప్పటికి వస్తాయా… అసలు సమ్మర్ సీజన్‌పై ఎందుకు నిర్మాతలు కన్నేశారనేది చూద్దాం.
సంక్రాంతి సీజన్‌కు వస్తామని చెప్పిన చాలా సినిమాలు వివిధ కారణాలతో సమ్మర్‌కు వచ్చేశాయి. మరోవైపు కొన్ని సినిమాలు సమ్మర్ టార్గెట్‌తోనే సిద్ధమవుతున్నాయి. చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’, పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’, ప్రభాస్ ‘రాధే శ్యామ్’, గోపీచంద్ ‘సీటీమార్’, రానా ‘విరాటపర్వం’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, శర్వానంద్ ‘శ్రీకారం’, నాని ‘టక్ జగదీష్’, సాయితేజ్ ‘రిపబ్లిక్’ సమ్మర్ రేసులో ఉన్నాయి. మరి వీటిలో ఎన్ని నిలుస్తాయి… ఎన్ని ప్రేక్షకుల ముందుకొస్తాయో చూడాలి.
సమ్మర్ సీజన్ అంటే ఒకప్పుడు స్కూళ్లు, కాలేజీల సెలవులు ఉండేవి. దీంతో నిర్మాతలు సమ్మర్ సీజన్‌కు ఎక్కువ సినిమాలు తీసుకొస్తుండేవారు. ఈసారి కూడా అలా సమ్మర్ సీజన్ వైపు చూడటం లేదు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్‌కు 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాలు విడుదల చేస్తున్నారు. అదే సమ్మర్ సీజన్‌కు వచ్చేసరికి ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి ఓకే చెబుతోందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద పెద్ద నిర్మాతలు సమ్మర్ సీజన్‌వైపే చూస్తున్నాయని అర్థమవుతోంది.