స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. సుమ కూడా తాను హోస్ట్ చేస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఈ సినిమాకి పబ్లిసిటీ చేస్తూనే ఉంది. ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ నుండి వస్తున్న సినిమా ఇది. ఇదివరకే ‘మోగ్లీ’ వరల్డ్ ను పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ వదిలారు. నాని కూడా దానికి వాయిస్ ఓవర్ అందించడం జరిగింది.
కానీ ఆడియన్స్ ని అది ఆకట్టుకోలేదు. ఇక డిసెంబరు 12న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో తాజాగా టీజర్ ను వదిలారు. ఎన్టీఆర్ ఈ టీజర్ ను డిజిటల్ గా లాంచ్ చేయడం జరిగింది.’మోగ్లీ’ టీజర్ 1:53 నిమిషాల నిడివి కలిగి ఉంది. రామాయణం బ్యాక్ డ్రాప్లో హీరో, హీరోయిన్లని పరిచయం చేశారు. కాకపోతే ఈ సినిమాలో హీరోయిన్ మూగ అమ్మాయి అని తెలుస్తుంది. హీరో లక్ష్యం పోలీస్ అవ్వడం.
తర్వాత హీరోయిన్ ను పొందాలనుకోవడం. అయితే విలన్ ఆల్రెడీ పోలీస్. అతని లక్ష్యం హీరోయిన్ ని పొందాలని ఆశపడటం. వీరిద్దరి మధ్య అడవుల్లో జరిగే యుద్ధమే ‘మోగ్లీ’ కథాంశం అని స్పష్టమవుతుంది. టీజర్లో టెక్నికల్ వాల్యూస్.. ముఖ్యంగా కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి బాగున్నాయి. కానీ టీజర్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా లేదు. అయితే విలన్ గా చేసిన బండి సంజయ్ పాత్ర మాత్రం ఇంపాక్ట్-ఫుల్..గా ఉండేలా ఉంది.
ఇక లేట్ చేయకుండా టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :