Mr. Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ సెకండ్ లిరికల్ సాంగ్ ఎలా ఉందంటే?

రవితేజకి (Ravi Teja) మంచి మాస్ ఇమేజ్ ఉంది. ఏ హీరో ఇమేజ్ ని అయినా సరే ఎలా వాడుకోవాలో హరీష్ శంకర్ కి (Harish Shankar)  బాగా తెలుసు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంది అంటే.. ఎంత మాసీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘మిరపకాయ్’ తో అది ప్రూవ్ అయ్యింది. అందుకే త్వరలో రాబోతున్న ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ ‘సితార్’ కూడా మంచి మార్కులు వేయించుకుంది. ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ అయ్యింది.

ఈ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే.. ఇది 4 నిమిషాల 34 సెకన్ల నిడివి కలిగి ఉంది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్లో (Mickey J Meyer) ఎంత మాస్ ఉందనేది ఈ పాటతో మరోసారి ప్రూవ్ అయ్యింది. బీట్స్ చాలా బాగున్నాయి. అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) , మంగ్లీ (Mangli) చాలా మాసీగా ఈ పాటని పాడారు. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ బీట్స్ కి తగ్గట్టు ఉన్నాయి.

‘బొమ్మా సోకులో బొంబాయి జాతరే బచ్చన్ గొంతులో బప్పిలహరే’… అంటూ సాగిన లిరిక్స్ దర్శకుడు హరీష్ శంకర్ స్పీచ్..ల మాదిరి ఎంతో ఎనర్జిటిక్ గా అనిపించాయి. రవితేజ, భాగ్యశ్రీ (Bhagyashri Borse)..ల కెమిస్ట్రీ ఈ పాటలో కూడా బాగా కుదిరింది. భాగ్య శ్రీ గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. మొత్తంగా మొదటి పాటలానే ఈ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus