‘సీతా రామం’ సినిమాలో సీతా మహాలక్ష్మిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. అయితే అప్పటికే ఆమె ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు తెలుసు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రసారమై ఆ సీరియల్‌లో ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే ఆమెను తొలుత మనం సల్మాన్ ఖాన్ సరసన చూడాల్సింది అంట. ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ‘సుల్తాన్’ సినిమాలో తొలుత మృణాల్‌నే అనుకున్నారట.
‘సుల్తాన్’ సినిమాలో అనుష్క పోషించిన పాత్రలో నిజానికి మృణాల్ నటించాలట. ఆ పాత్ర కోసం కొన్నిరోజులు మల్లయుద్ధంలో మృణాల్ శిక్షణ తీసుకుందట. మూడు నెలల్లో 11 కిలోలు తగ్గిందట. అయితే ఏమైందో ఏమో చివరికి అవకాశం అనుష్క శర్మకు ఇచ్చారట. ఎక్కువ బరువు తగ్గడంతోనే ఛాన్స్ కోల్పయి ఉండొచ్చు అని చెప్పింది మృణాల్. ఆ తర్వాత కొన్ని రోజులకు ‘లవ్ సోనియా’ అనే సినిమా ఆడిషన్ ఇచ్చిందట. అలా ఇండో అమెరికన్ సినిమాలో నటించే అవకాశం సంపాదించింది.
అక్రమ రవాణాకి బలైన చెల్లిని రక్షించడానికి అదే రొంపిలోకి దిగి వ్యభిచార గృహానికి చేరుకున్న యువతిగా మృణాల్ ఆ సినిమాలో కనిపిస్తుంది. ఆ సినిమా షూటింగ్‌కి కొన్నిరోజుల ముందు కోల్‌కతాలోని ఓ వేశ్యా గృహంలో రెండువారాలు ఉందట మృణాల్. అక్కడి వారి పరిస్థితి చూసి, వారి కథలు విన్నాక బీపీ డౌన్ అయిపోయిందట. వాళ్ల కథలే చెవుల్లో మార్మోగుతుండేవట. కొన్నాళ్లకి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట. దాంతో దర్శకుడు కౌన్సెలింగ్ ఇచ్చి మామూలు మనిషికి చేశారట.
ఇబ్బందిగా అనిపించినా.. ధైర్యం చేసి షూటింగ్ స్పాట్‌కి వెళ్లిందట. అక్కడ దర్శకుడు యాక్షన్ చెప్పగానే నటించలేక ఏడుపొచ్చేసిందట మృణాల్‌కి. 17 ఏళ్ల అమ్మాయిని 60 ఏళ్ల వృద్ధుడికి అమ్మే సన్నివేశమది. ఆ సీన్‌లో డైలాగులు చెబుతుంటే వేశ్యల కథలు కళ్ల ముందు మెదిలాయట. దీంతో ఇక నటించలేనని చెప్పి సెట్‌లో కుప్పకూలిపోయిందట మృణాల్. అయితే ‘నిన్ను బలవంతపెట్టను. కానీ నువ్వు ఈ సన్నివేశం చేస్తే ప్రపంచం చూస్తుంది’’ అని దర్శకుడు చెప్పి ఆమెను ఒప్పించారట. అలా మృణాల్ తొలి సినిమా బయటకు వచ్చింది.
Most Recommended Video
నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!