Mrunal, Samantha: సమంత అభిమానిగా మారిపోయిన మృణాల్ ఠాకూర్.. ఏమైందంటే?

‘సీతా రామం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్… మొదటి సినిమాతోనే అందరి మనసులు దోచేసింది అని చెప్పాలి. బాలీవుడ్ లో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 4 ఏళ్ళు అయినా రాని గుర్తింపు ఈమెకు ‘సీతా రామం’ చిత్రంతో లభించింది. ఈమె పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ చేసింది తెలుగు సినిమానే చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అనిపించుకోదు.’సీతా రామం’ లో మృణాల్ అంత చక్కగా.. చాలా హుందాగా నటించింది.

ప్రస్తుతం మృణాల్ (Mrunal) నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హిందీలో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా మృణాల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇక్కడ ‘సీతా రామం’ లో కనిపించినట్టు కనిపించదు. కొద్దిరోజులుగా బికినీ ఫొటోలతో ఓ రేంజ్ లో దాడి చేస్తుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు అభిమానులతో కూడా ముచ్చటిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.విచిత్రంగా మృణాల్..

సమంత నిర్వహించిన ఆస్క్ సామ్ అనే చిట్ చాట్ సెషన్ లో పాల్గొనడం అందరికీ షాకిచ్చింది. ‘ఆస్క్ సామ్’ హ్యాష్ ట్యాగ్ లో సమంతను ఈమె ఊహించని ప్రశ్న అడిగింది ..‘శాకుంతలం సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆతృతగా ఉన్నారు. సామ్.. మీరు చాలామందిని ఇన్స్ స్పైర్ చేస్తున్నారు. మనిద్దరం కలిసి సినిమా ఎప్పుడు చేద్దాం..’ అంటూ అడిగి అందరినీ షాక్ కు గురిచేసింది మృణాల్. ఇందుకు సమంత బదులిస్తూ.. ‘ఈ ఐడియా నాకు నచ్చింది.

“#Gumraah beautiful @mrunal0801కి అభినందనలు చెబుదాం. మీరూ ఈ ఐడియాని ప్రేమించండి!!” అంటూ జవాబిచ్చింది. సమంత ఇచ్చిన జవాబు అందరినీ కన్ఫ్యూజన్లో పడేసినా.. మృణాల్ కోరిక మాత్రం అందరికీ నచ్చింది. ‘నిజంగా వీళ్ళు కలిసి ఏమైనా సినిమా చేస్తున్నారా? అందుకే పరోక్షంగా ఈ విషయంపై స్పందించారా?’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక సమంత నటించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus