Mrunal Thakur: ఆ స్టార్ హీరో సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న నటి… కల నెరవేరేనా?

బాలీవుడ్ సీరియల్స్ అలాగే సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ కి పరిమితమైనటువంటి నటి మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నాని సరసన మృణాల్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే .

ఇది కాకుండా ఈమె నటుడు విజయ్ దేవరకొండతో కూడా కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఈ విధంగా మృణాల్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

అయితే తాజాగా ఈమె (Mrunal Thakur) ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మనసులో ఉన్న కోరికను తన కలను బయటపెట్టారు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనకు ఓ పెద్ద కోరిక ఉందట. ఆ కోరిక గురించి ప్రతిరోజు కలకంటూనే ఉన్నానని చెప్పుకొచ్చారు. మరి అంత పెద్ద కోరిక ఆకల ఏంటి అనే విషయానికి వస్తే… తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి మహేష్ బాబు తో నటించాలన్నదే తన కోరిక అని తెలిపారు.

ఇలా ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ప్రతిరోజు ఎదురుచూస్తున్నానని ఈ కోరిక నెరవేరాలని కలలు కంటున్నానని తెలిపారు.ఇలా మహేష్ బాబుతో నటించాలని ఉందంటూ ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే సీతారామం వంటి మరొక హిట్ ఈమె ఖాతాలో పడితే మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని తెలుస్తోంది. మరి మహేష్ బాబుతో నటించాలనే ఈమె కలను నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus