Mrunal Thakur: కథలు ఓకే చేయడంలో స్లో అయిన మృణాల్‌.. వారిలా దెబ్బపడిపోకుండా..!

‘సీతా రామం’(Sita Ramam) సినిమాతో సీతగా టాలీవుడ్‌ జనాలకు పరిచయమైన మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) .. ఆ వెంటనే ‘హాయ్‌ నాన్న’(Hi Nanna)లో యశ్నగా వచ్చింది. రెండు సినిమాల్లోని పాత్రల పేర్లతో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ఇందు అంటూ ‘ఫ్యామిలీ స్టార్‌’తో (Family Star) వస్తే జనాల్ని ఆమెను తిరస్కరించలేదు కానీ.. సినిమాను తిరస్కరించారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఆమె కొత్త సినిమాలేవీ ఓకే చేయలేదురు. మరోవైపు పాత్రల ఎంపిక విషయంలో ఆమె చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Mrunal Thakur

నటనలో ఎలిగెన్స్‌, బాడీలో ఫ్యాషన్‌ సెన్స్‌తో ఇటు సినిమాల్లో అటు సోషల్‌ మీడియాలో అదరగొడుతోంది మృణాల్‌ ఠాకూర్‌. తెలుగు, హిందీ, తమిళ చిత్రాలకు మాత్రమే పరిమితం కాదు అంతకు మించి ఉండాలని కోరుకుంటోంది. ఈ మధ్య కాలంలో నేను చాలా స్క్రిప్ట్‌లు వింటున్నాను. ప్రస్తుతం దర్శక నిర్మాతలు తన కోసమే ప్రత్యేకంగా కథలు సిద్ధం చేస్తున్నారని, ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉందని చెప్పింది.

‘సీతారామం’, ‘హాయ్‌ నాన్నా’ సినిమాలతో వాళ్ల ఇంట్లో అమ్మాయిగా నన్ను తెలుగు ప్రేక్షకులు స్వీకరించారు. అందుకే తెలుగు ప్రేక్షకులను ఎప్పటికీ నిరాశపరచాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్‌ నిర్మించుకుంటున్నాను. అందకే నాకు తగినవి, నన్ను ప్రేక్షకులు చూడాలనుకుంటున్న కథలను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాను అని చెప్పింది.

ఇక మృణాల్‌ తెలుగులో ఏ సినిమా కూడా కొత్తగా ఒప్పుకోలేదు. హిందీలో ‘పూజా మేరీ జాన్‌’ అనే సినిమా పూర్తి చేసింది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఇది కాకుండా ‘హాయ్‌ జవానీ తో ఇష్క్‌ హో హై’, ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’, ‘తుమ్‌ హో తో’ సినిమాల్లో నటిస్తోంది. మరి తెలుగులో ఎప్పుడు సినిమాలు ఓకే చేస్తుందో, చేస్తే ఎలా కథలు ఓకే చేస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus