ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన ఎం.ఎస్.రాజుకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం దర్శకునిగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఎం.ఎస్.రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు కెరీర్ తొలినాళ్ల నుంచి డ్యాషింగ్ ప్రొడ్యూసర్ అని పేరు ఉందని డబ్బులు వస్తాయా? పోతాయా? అని తాను ఆలోచించనని వెల్లడించారు. కథకు అవసరమైతే ఎంతైనా ఖర్చు చేయాలని తాను అదే ఆలోచిస్తానని ఎం.ఎస్.రాజు చెప్పుకొచ్చారు. తాను ఏ సినిమా నిర్మించినా నా సినిమా అనే భావనలో ఉంటానని కథ, కథనం, సంగీతం విషయంలో నా సినిమా అని చేస్తానని ఎం.ఎస్.రాజు కామెంట్లు చేశారు.
హీరో డేట్లు దొరికితే సినిమా చేయడం తనకు నచ్చదని కథకు తగిన విధంగానే హీరోను ఎంపిక చేసుకుంటానని ఆయన వెల్లడించారు. దేవి సినిమా అప్పట్లోనే పాన్ ఇండియా సినిమా అని ఆ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయో లెక్కలేదని ఆయన తెలిపారు. మనసంతా నువ్వే సినిమా చిన్న సినిమా అయినా బాగా డబ్బు సంపాదించి పెట్టిందని ఒక్కడు, వర్షం, దేవి కూడా బాగా ఆడాయని ఆయన తెలిపారు. పౌర్ణమి సినిమాకు తాను, ప్రభాస్ చాలా కష్టపడ్డామని ఆ సినిమా విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురయ్యారని ఎం.ఎస్.రాజు కామెంట్లు చేశారు.
డర్టీ హరి సినిమాను ఓటీటీలో విడుదల చేసినా మంచి ఫలితం దక్కిందని ఎం.ఎస్.రాజు వెల్లడించారు. 7 డేస్ 6 నైట్స్ సక్సెస్ సాధిస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారని ఎం.ఎస్.రాజు కామెంట్లు చేశారు.
మహేష్ బాబు మంచి మనిషని స్నేహితుడిలా ఉంటారని మహేష్ బాబుతో సినిమా చేయకపోయినా పరవాలేదని ఒక్కడు మూవీ పేరు చెడగొట్టకుండా ఉంటే చాలని అనిపించిందని ఎం.ఎస్.రాజు వెల్లడించారు. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఒక ప్రాజెక్ట్ అనుకున్నా ముందుకు సాగలేదని ఎం.ఎస్.రాజు అన్నారు.