Mufasa The Lion King Collections: ఆల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కుమ్మేసిందిగా!
- December 26, 2024 / 05:40 PM ISTByPhani Kumar
2019లో విడుదలై సూపర్ హిట్ అనిపించుకున్న ‘ది లయన్ కింగ్’ కి ప్రీక్వెల్ గా ‘ముఫాసా’ (Mufasa The Lion King) రూపొందింది. ఇది సింబా తండ్రి ‘ముఫాసా’ కథ. ‘ముఫాసా’ మిలేలే సామ్రాజ్యానికి రాజు కాక ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. టాకా అలియాస్ స్కార్ ముఫాసాని ఎందుకు ద్వేషిస్తున్నాడు వంటి అంశాలతో రూపొందిన సినిమా ఇది. ముఫాసా పాత్రకు మహేష్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పడంతో దీనిపై మొదటి నుండి ఈ సినిమాపై హైప్ ఏర్పడింది.
Mufasa The Lion King Collections:

డిసెంబర్ 20 న భారీ పోటీలో రిలీజ్ అయిన ‘ముఫాసా’ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. క్రిస్మస్ హాలిడే రోజున కూడా ఈ సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 1.85 cr |
| సీడెడ్ | 0.53 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.17 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 3.55 cr |
‘ముఫాసా’ (Mufasa The Lion King) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 6 రోజుల్లో రూ.6.47 కోట్ల షేర్ ను కేవలం తెలుగు వెర్షన్ తోనే రాబట్టింది. మిగిలిన వెర్షన్లతో కలుపుకుంటే రూ.7.20 కోట్ల వరకు షేర్ వచ్చిందని సమాచారం. ఇప్పటివరకు ‘ముఫాసా’కి రూ.4.2 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చేసింది.












