బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో మొదటివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు సీనియర్స్, ఇద్దరు జూనియర్స్ ఉన్నారు. ఇందులో సరయు, ముమైత్ ఖాన్, అరియానా, నటరాజ్ మాస్టర్, హమీదా సీనియర్స్ ఉంటే, మిత్రాశర్మ ఇంకా ఆర్జే చైతూలు జూనియర్స్ ఉన్నారు. వీరిలో నిజానికి చాలామంది మిత్రాశర్మ వెళ్లిపోతుందనే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది.
నిజానికి ముమైత్ ఖాన్, సరయు, మిత్రాశర్మ ముగ్గురూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. వీళ్లకి కేవలం పది శాతం వరకూ మాత్రమే అన్ అఫీషియల్ గా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది జరిగింది. ఇందులో ముమైత్ ఖాన్ కొద్దిగా ముందంజలో ఉన్నా కూడా అఫీషియల్ ఓటింగ్ లో ఖచ్చితంగా వెనకబడి ఉండచ్చు. అందుకే, ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం లైవ్ స్ట్రీమింగ్ లో నాన్ స్టాప్ నాగార్జున వీకండ్ సందడి స్టార్ట్ అయ్యింది. శనివారం హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడిస్తూ కొంతమందిని సేఫ్ చేసిన నాగార్జున, సండే గేమ్స్ ఆడిస్తూ ముమైత్ ఖాన్ ని ఎలిమినేట్ చేసినట్లుగా చెప్తున్నారు.
ఇక ముమైత్ ఖాన్ కూడా వచ్చీ రాని తెలుగులో హౌస్ లో ఇబ్బంది పడుతోంది. అంతేకాదు, ఆర్జే చైతూ డిస్గస్టింగ్ ట్యాగ్ ఇస్తే తీస్కోలేకపోయింది. హమీదాతో కాస్త శృతిమించిన ఫన్ చేసింది. ఇక మార్నింగ్ యాక్టివిటీలో కూడా బాగా ఎమోషనల్ అయ్యింది. ముమైత్ నుంచీ ఆశించినంత పెర్ఫామెన్స్ ఈవారం రాలేదు. అందుకే, ఫ్యాన్స్ కూడా ఓటు వేయడానికి ఆసక్తిని చూపించలేదు. దీంతో ముమైత్ ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.
ఫస్ట్ వీక్ లోనే సీనియర్ కంటెస్టెంట్ అవుట్ అయ్యేసరికి హౌస్ మేట్స్ మరింత జాగ్రత్తగా గేమ్ పైన ఫోకస్ పెడతారు. ఇక నామినేషన్స్ అప్పుడు తమ పవర్ ని చూపిస్తారు. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత దీన్ని టెలివిజన్ లో కూడా ప్రసారం చేయాలని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తోంది. మొత్తానికి అదీ మేటర్.