హీరోయిన్ సంజనని విచారించిన పోలీసులు.. కారణం అదే..!

  • July 1, 2020 / 02:48 PM IST

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఇటీవల అఘాయిత్యం చేసుకున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ వయసులోనే అతను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం.. యావత్ భారతదేశ ప్రజల్ని విషాదంలోకి నెట్టేసిందనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా ఎదిగిన సుశాంత్.. అంత ఘోరానికి పాల్పడడం పట్ల బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉందని భావించి.. వారిని నెపోటిజం పేరుతో ఘోరంగా ట్రోల్ చేశారు నెటిజన్లు.

ఇదిలా ఉండగా.. మరోపక్క సుశాంత్ కేసు ముంబై పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఈ కేసుని త్వరగా క్లోజ్ చెయ్యాలని వారు అహర్నిశలు ప్రయత్నిస్తున్నా వారికి సరైన లీడ్ దొరకడం లేదట. ఇప్పటికే 28 మందిని పోలీసులు విచారించి.. వారి స్టేట్మెంట్స్ ను తీసుకున్నారట. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సంజన సంఘీని కూడా విచారణకు పిలిచినట్టు తెలుస్తుంది. ఆమె సుశాంత్ చివరి చిత్రంలో నటించింది కాబట్టే.. విచారణకు హాజరు కావాలని పిలిచారట.

సుశాంత్ చివరి చిత్రం షూటింగ్ సమయంలో.. అతను ఎలా ఉండేవాడు?అతని మానసిక స్థితి ఎలా ఉండేది? అనే అంశాల పై.. పోలీసులు సంజనను విచారించినట్టు తెలుస్తుంది.cవారు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పిందని.. అయితే అతను ఇంత ఘోరానికి పాల్పడడానికి అంత బలమైన కారణం ఏంటనేది? తనకి కూడా అర్ధం కావట్లేదని చెప్పినట్టు సమాచారం.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus