గతేడాది నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ళ అభిమానులు ఇప్పటికీ ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అయితే చైతన్య, సమంత లు మాత్రం హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. 4 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య, సమంత.. పెళ్లయ్యాక 4 ఏళ్ళు కూడా కలిసుండలేదు. అలా అని వాళ్ళ మధ్య ఎక్కువ మనస్పర్థలు వచ్చినట్టు కూడా ఎప్పుడూ వార్తలు వచ్చింది.
అయితే చైతన్య,సమంత..ల బంధం, విడాకుల గురించి తాజాగా సీనియర్ నటుడు మురళీమోహన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ‘అవును.. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో అపార్ట్మెంట్లు మూడు కట్టుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కట్టుకున్నవి అవి. నాగ చైతన్య అవి చూసి.. అమ్ముతారా అని అడిగాడు. ఇది అమ్మేది కాదు మా ఫ్యామిలీ కోసం అని కట్టుకున్నాం అని చెప్పాను. అతను నాగార్జున గారికి చెప్పినట్టు ఉన్నాడు.
ఇండస్ట్రీకి రాకముందు నుండి అక్కినేని ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం.నాగేశ్వరరావు గారికి కూడా నేనంటే చాలా అభిమానం. నాగార్జున గారు ఒకటి మాకు ఇవ్వండి అని అడిగారు. ఆయన అడిగితే కాదనలేక పోయాను. మా అబ్బాయి కోసం నిర్మించింది నాగ చైతన్య కి ఇచ్చాను.నాగ చైతన్య, సమంత ఆ అపార్ట్మెంట్ లోకి వచ్చారు. ఆ దంపతులు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఉదయాన్నే లేచి జిమ్ చేసేవారు. చాలా బాగా కలిసుండే వారు. పార్టీలు పెట్టడం,
గట్టిగా సౌండ్ చేయడం వంటివి చేసేవారు కాదు. అలాంటి వాళ్ళు విడిపోతున్నారు అని మా పనిమనిషి వచ్చి చెబితే తెలిసిందే. అప్పటికే నాగ చైతన్య బయట వేరే హోటల్ లో ఉండటం చేశాడు. అప్పటికే వాళ్ళు నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఎందుకు అనేది నాకు తెలీదు. నాకు ముందుగా తెలిసుంటే కనుక నాగార్జున గారితో మాట్లాడి ఏదో ఒకటి చేసేవాడిని.కానీ.. మనం అనుకున్నవన్నీ జరగవు కదా’ అంటూ మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!