దగ్గుబాటి రామానాయుడు గారి చిన్నబ్బాయిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన వెంకటేష్.. తన సొంత టాలెంట్ తో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు. నవ్వించినా ఆయనే నవ్విస్తారు.. ఏడిపించినా ఆయనే అని వెంకీ గురించి అంతా అంటుంటారు. ఏ పాత్ర తీసుకున్నా అందులో పరకాయ ప్రవేశం చేసేస్తుంటారాయన. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో హిట్ పర్సెంటేజ్ ఎక్కువ కలిగిన హీరో అతనే..! వివాదాలకు దూరంగా ఉండే హీరో కూడా అతనే. తన సినిమాలు రిలీజ్ అయిన టైంలో తప్ప.. ఆయన బయట ఎక్కువగా కనపడరు.
ఒకవేళ కనిపించారు అంటే అది క్రికెట్ స్టేడియంలోనే అని చెప్పాలి. నాని ఓ సందర్భంలో చెప్పినట్టు వెంకటేష్ ఆవకాయ లాంటివారు. ఆయన నచ్చని తెలుగోడు అంటూ ఉండడు. ఏ స్టార్ హీరో అభిమాని అయినా సరే వెంకటేష్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. వెంకటేష్ తొందరగా ఎవ్వరి మనసు నొప్పించే వ్యక్తి కాదు. ఈ విషయం పై ఇటీవల మురళీ మోహన్ కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అది ఎందుకు అనేది ఆయన మాటల్లోనే చూద్దాం పదండి.
మురళీ మోహన్ మాట్లాడుతూ.. “వెంకటేష్ కు మొహమాటం ఎక్కువ. మా అసోసియేషన్ ఏర్పడినప్పటి నుండి దానికి అధ్యక్షుడిగా హీరోలనే ఉండాలని అందరూ భావించి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏ పని జరగాలన్నా హీరోలు ఉంటే తొందరగా జరుగుతుంది.అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారు. కమెడియన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వేషాలు వేసుకునే వారిని ఉంచితే పనులు స్పీడుగా జరగవు. వారి మాటలను స్టార్ హీరోలు వినరు. అదే హీరోలను ఉంచితే వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది, వారి మాట ఇష్టపడడానికి చాలామంది ఉంటారు.
మోహన్ బాబు, చిరంజీవి, నాగార్జున లాంటివారు అధ్యక్ష పదవిని చేపట్టారు. కానీ ఒకానొక సమయంలో హీరో వెంకటేష్ మా అధ్యక్ష పదవిని చేపట్టమని అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించాడు. మా అసోసియేషన్ మొత్తం వెళ్లి బ్రతిమిలాడినా ‘దాని గురించి నాకు పెద్దగా తెలియదు’ అని తప్పుకున్నాడు. చివరికి అందరూ బలవంతం చేయడంతో ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఉంటానని ఒప్పుకున్నాడట. ఒకసారి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడైన వెంకటేష్ ఇప్పటికి కూడా అధ్యక్ష పదవిని చేపట్టింది లేదు. ఆయన మనస్తత్వం అంత సున్నితమైనది” అంటూ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!