Athadu: ‘అతడు’ గురించి మురళీమోహన్ బయటపెట్టిన సంచలన నిజాలు

చాలా మంది ‘అతడు’ సినిమా థియేటర్లలో ప్లాప్ అయ్యింది అంటుంటారు. కానీ అందులో నిజం లేదు. ఈ సినిమాకి నిర్మాత ఎక్కువ బడ్జెట్ పెట్టారు. అందువల్ల థియేట్రికల్ బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు. కానీ బయ్యర్స్ అంతా సేఫ్ అయ్యారు.

Athadu

కానీ నిర్మాత నష్టాల్లోనే ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ తర్వాత టీవీ రైట్స్ వంటివి వాటి వల్ల సేఫ్ అయ్యారట. తాజాగా మురళీమోహన్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు.

 

మురళీమోహన్ మాట్లాడుతూ..” ‘అతడు’ సినిమా ఫైనాన్సియల్ గా పెద్ద లాభాలు తీసుకురాలేదు. చాలా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా టీవీల్లో వచ్చినన్నిసార్లు.. అప్పటికి ఏ సినిమా కూడా రాలేదు అనే చెప్పాలి. ప్రతి శని, ఆదివారాల్లో ఏదో ఒక ఛానల్లో ‘అతడు’ సినిమా టెలికాస్ట్ అయ్యింది. అప్పుడు చాలా ఎక్సలెంట్ గా ఉందండీ సినిమా. టీవీల్లో ఎన్నిసార్లు వస్తే అన్ని సార్లు చూస్తున్నాం. ముఖ్యంగా సెకండాఫ్ లో కామెడీ కానీ, పాటలు కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పి చాలా మంది మెచ్చుకున్నారు. ఆ తర్వాత రీ రిలీజ్, శాటిలైట్ రైట్స్ రెన్యువల్ అలాగే ఇంటి సెట్ షూటింగ్లకి ఇవ్వడం వంటి వాటి రూపంలో మేము లాభాలు ఆర్జించాము. ముఖ్యంగా మా ‘జయభేరి’ సంస్థకి మంచి పేరు తీసుకొచ్చింది ‘అతడు’ సినిమా” అంటూ చెప్పుకొచ్చారు.

మురళీమోహన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. చాలా మందికి ‘అతడు’ హిట్ సినిమా అనే క్లారిటీ ఇచ్చాయి.

 

2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus