Murali Mohan, Uday Kiran: ఉదయ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించిన మురళీ మోహన్!
- March 31, 2024 / 08:14 PM ISTByFilmy Focus
టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో సత్తా చాటారు. మురళీ మోహన్ వయస్సు 83 సంవత్సరాలు కాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఉదయ్ కిరణ్ (Uday Kiran) గురించి వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు సాధించిన ఉదయ్ కిరణ్ కు హైపర్ టెన్షన్ ఎక్కువని మురళీ మోహన్ వెల్లడించారు. బీపీ తరహాలో ఆయనకు టెన్షన్ వచ్చేస్తుందని మురళీ మోహన్ పేర్కొన్నారు.
ఆ సమయంలో మనిషి కంట్రోల్ లో ఉండటం కష్టం అని ఆయన తెలిపారు. ఆ సమయంలో మేము ఉదయ్ కిరణ్ ను ఒక డాక్టర్ దగ్గర జాయిన్ చేశామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. ఆ డాక్టర్ ఉదయ్ కిరణ్ కు చికిత్స మొదలుపెట్టడంతో పాటు ఎన్నో జాగ్రత్తలు చెప్పారని ఆయన తెలిపారు. డాక్టర్ దగ్గర ఉదయ్ నార్మల్ గా ఉన్నా ఏదైనా ఘటన జరిగితే ఆవేశానికి లోనయ్యేవాడని మురళీ మోహన్ పేర్కొన్నారు.

ఉదయ్ కిరణ్ తన సమస్యను అదుపు చేసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఆయన తెలిపారు. తన లైఫ్ లో ఏ మంచి జరిగినా ఉదయ్ కిరణ్ చిరంజీవితో (Chiranjeevi) షేర్ చేసుకునే వారని మురళీ మోహన్ అన్నారు. ఉదయ్ కిరణ్ మంచి కుర్రాడని మెగా ఫ్యామిలీలో భాగం అవుతాడని భావించామని ఆయన కామెంట్లు చేశారు. అయితే తెలియని కారణాల వల్ల ఆ సంబంధం అప్సెట్ అయిందని ఆయన తెలిపారు.

ఉదయ్ కిరణ్ నటించిన చాలా సినిమాలు ఆడలేదని మురళీ మోహన్ కామెంట్లు చేశారు. ఉదయ్ కిరణ్ ను కోల్పోయిన సమయంలో నా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన స్థాయిలో బాధ పడ్డానని ఆయన తెలిపారు. మురళీ మోహన్ వెల్లడించిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు ఈ కామెంట్ల గురించి ఎలా స్పందిస్తారో చూడాలి.












