Ram: యంగ్ హీరోకి కథ చెప్పిన మురుగదాస్!

  • June 2, 2021 / 05:15 PM IST

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ప్రేక్షకుల్లో రామ్ ఇమేజ్ మారింది. మాస్ కథల్లో నటించడానికి ఈ హీరో ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ ఏడాది ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాలి కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఇదిలా ఉండగా.. రామ్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టినట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేయబోతున్నాడనేది లేటెస్ట్ టాక్. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ కి సంబంధించిన ప్రకటన రానుందని చెబుతున్నారు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తారని అంటున్నారు. గత కొంతకాలంగా మురుగదాస్ కి సరైన హిట్టు పడడం లేదు.

తెలుగులో మహేష్ బాబు హీరోగా చేసిన ‘స్పైడర్’ డిజాస్టర్ అయింది. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కించిన ‘సర్కార్’ మోస్తరుగా ఆడింది. రజినీతో చేసిన ‘దర్బార్’ కూడా ఏమంత సక్సెస్ ను తీసుకురాలేకపోయింది. దీంతో మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి రామ్ తో ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus