ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్ గా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నటువంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయడమే కాకుండా అనంతరం తెలుగు భాష చిత్రాలలో కూడా అవకాశాలు అందుకున్నారు. ఇలా సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అనిరుద్ అందుకుంటున్నారనే చెప్పాలి.
ఇంత చిన్న వయసులోనే ఇప్పటికే 50 సినిమాలకు పైగా సంగీతం అందించినటువంటి ఈయన మరో డజన సినిమా అవకాశాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఇలా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నటువంటి అనిరుద్ ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈయన సినిమా చేశారు అంటే సినిమాల్లో పాటలకు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇస్తాడని పేరు ఉంది.
ఇలా మ్యూజిక్ విషయంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి (Anirudh Ravichander) అనిరుద్ అసలు ఏం చదువుకున్నారు అనే విషయానికి వస్తే చాలామంది ఇలా సంగీతంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు చిన్నప్పటి నుంచి కూడా వివిధ రకాల వాయిద్యాలను వాయించడం, నేర్చుకొని ఉంటారు. అలాగే అనిరుద్ రవిచంద్రన్ కూడా ఓ పక్క సంగీతం నేర్చుకుంటూనే మరోపక్క డిగ్రీ కూడా చదివాడు. అనంతరం లండన్ లో ఫేమస్ మ్యూజిక్ కాలేజీ ట్రినిటీ లో పియానో నేర్చుకొని, అక్కడ ఫ్యూజన్ బ్యాండ్ లో కూడా పనిచేసాడు.
ఇక చెన్నై తిరిగి వచ్చినటువంటి అనిరుద్ ఇక్కడ సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేశారు. ఏ సౌండ్ ఎక్కడ కరెక్ట్ గా వాడాలో, ఎంత లెవల్లో వాడాలో అనిరుధ్ కి బాగా తెలుసు. దీంతో కేవలం పాటలకు సంగీతం మాత్రమే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై పట్టు సాధించి ఇప్పుడు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు