సినిమాకు మ్యూజిక్ అనేది ప్రాణం. ప్రతి సన్నివేశాన్ని మ్యూజిక్ ఎలివేట్ చేస్తుంది. సాంగ్స్ హిట్ అయితే సగం సినిమా హిట్ అంటారు. 90లలో ఓ ఇద్దరు మిత్రులు టాలీవుడ్ ని ఏలారు. వారే రాజ్-కోటి. అప్పట్లో ఇదో బ్రాండ్ నేమ్. స్టార్ హీరోలకు పక్కా కమర్షియల్ హిట్స్ రాజ్-కోటి ఇచ్చారు. ఇళయరాజా ప్రభంజనాన్ని తట్టుకొని నిలిచిన సంగీత ద్వయం రాజ్-కోటి. మెగాస్టార్ చిరంజీవికి అయితే లైఫ్ టైమ్ గుర్తుండే పాటలు ఇచ్చారు. ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వారసులే. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు.
ఆయన తండ్రి టీవీ రాజు మ్యూజిక్ డైరెక్టర్. ఇక కోటి పూర్తి పేరు సాలూరి కోటేశ్వరరావు. మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు కుమారుడు. వీరిద్దరూ కలిసి తమ సంగీత ప్రయాణం సాగించారు. 1982లో మొదలైన వీరి జర్నీ సక్సెస్ఫుల్ గా సాగింది. రాజ్-కోటి మ్యూజిక్ అంటే సూపర్ హిట్ అనే ఒక బ్రాండ్ నేమ్ ఏర్పడింది. ఒక దశాబ్దం పాటు వీరు చిత్ర పరిశ్రమను ఏలారు. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న వీరి జర్నీ సడన్ రెండు దారులు తీసుకుంది.
1995 తర్వాత రాజ్-కోటి (Koti) విడిపోయారు. అప్పట్లో ఇది సంచలన పరిణామం. అసలు రాజ్-కోటి ఎందుకు విడిపోయారు. దానికి కారణాలు ఏంటనే సందేహాలు ఏర్పడ్డాయి. కోటి ఓ సందర్భంలో దీనిపై వివరణ ఇచ్చారు. ఒక రోజు రాజ్ మనం విడిపోదాం. ఎవరి మ్యూజిక్ వాళ్ళం చేసుకుందాం అన్నారు. అందుకు నేను ఓకే అన్నాను. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. పదేళ్లకు పైగా కలిసి మ్యూజిక్ చేశాం. ప్రతి డెకేడ్ కి ట్రెండ్ మారుతుంది, అంటారు. రాజ్ నేను ఎందుకు కలిశామో తెలియదు. ఎందుకు విడిపోయామో కూడా తెలియదు.
కొందరు కలిపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సింగర్ ఎస్పీ బాలు చాలా బాధపడ్డారు. ఎవరూ లేనప్పుడు నా వద్దకు వచ్చి ఇద్దరూ మరలా కలవండి. మీది మంచి కాంబినేషన్ అనేవారు. ఒకసారి ఇద్దరం కలిసి మ్యూజిక్ చేస్తున్నామని ప్రకటించాము. కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు… అని కోటి చెప్పుకొచ్చారు.ఏళ్ళ తరబడి వినసొంపైన మ్యూజిక్ ఇచ్చిన రాజ్ నేడు మరణించారు. ఆయన మరణంపై చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. రాజ్ మృతిపై కోటి మాట్లాడుతూ… ఆయన పాటల్లో ఎన్నటికీ బ్రతికే ఉంటారని అన్నారు.