ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన కోటి ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు వస్తున్నా వాటికి అంగీకరించడం లేదనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోటి మాట్లాడుతూ తాను సంగీతం కోసం చాలా సమయం వెచ్చించానని దేవుడు, తండ్రిగారు, గురువు చక్రవర్తి ఆశీర్వాదం వల్లే తాను ఇన్ని సినిమాలు చేయడం సాధ్యమైందని కోటి అన్నారు. తమ ఇంట్లోనే నాన్నగారి మ్యూజిక్ సిట్టింగ్ లు జరిగేవని కోటి చెప్పుకొచ్చారు.
మా అన్నయ్య వాసూరావు ఎంతో మందికి గిటారు నేర్పించారని కోటి తెలిపారు. నాన్న స్వరపరిచిన పాటలలో మనసున మనసై పాట ఎంతో ఇష్టమని కోటి చెప్పుకొచ్చారు. ఆ పాటను శ్రీశ్రీ రాశారని కోటి కామెంట్లు చేశారు. 1977లో రజినీకాంత్ నన్ను చూసి తాను చాలా స్మార్ట్ గా, షార్ప్ గా ఉన్నానని చెప్పారని కోటి కామెంట్లు చేశారు. తాను మొదట రమేష్ నాయుడు దగ్గర పని చేశానని తర్వాత చక్రవర్తి, ఇళయరాజా దగ్గర పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు.
రాజ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ప్రళయ గర్జన అని కోటి పేర్కొన్నారు. సంసారం సినిమాతో మొదట బ్రేక్ వచ్చిందని ఆయన అన్నారు. హిందీలో 12 సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చామని కోటి తెలిపారు. మరణశాసనం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి పేరు రావడంతో యముడికి మొగుడు సినిమాకు పని చేసే ఛాన్స్ దక్కిందని ఆయన అన్నారు. రాజ్ తో కలిసి చివరివరకు పని చేయాలని అనుకున్నానని కానీ విడిపోయామని కోటి తెలిపారు.
విడిపోయినా ఇప్పటికీ మేం స్నేహితులుగానే ఉంటామని కోటి వెల్లడించారు. నేను గిటార్ లోనే పాటలను కంపోజ్ చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. రెహమాన్, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, థమన్, హరీష్ జైరాజ్ తమ దగ్గర పని చేశారని కోటి తెలిపారు. నా శిష్యులకు నేనే పోటీ అని నాకు వాళ్లు పోటీ కాదని కోటి చెప్పుకొచ్చారు. వాళ్లు నాకు పోటీ అంటే నేను ఒప్పుకోనని ఛాన్స్ వస్తే మాత్రం నాకు నేనే పోటీ అని కోటి కామెంట్లు చేశారు.