ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) ఒకప్పుడు తన పని తాను చూసుకునేవారు. సినిమాలకి మ్యూజిక్ కొట్టడం తప్ప ఆయన ఇంకో పని పెట్టుకునేవారు కాదు. వివాదాలకు చాలా అంటే చాలా దూరంగా ఉండేవారు. కానీ కొన్నాళ్లుగా ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తుంది. ఏదో ఒక ఈవెంట్ కి హాజరైనప్పుడు ఆయన తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) సక్సెస్ మీట్ కి వెళ్లి.. అక్కడ ‘ఈ సక్సెస్ మీట్ నిజంగా హిట్ అయ్యినందుకే పెడుతున్నారా.. లేక వేరే ఉద్దేశంతో పెడుతున్నారా? ఈ మధ్య చాలా మంది అలాగే పెడుతున్నారు.
అందుకే ఇండస్ట్రీలో సక్సెస్ మీట్ అంటే వేరే అర్థం వస్తుంది’ అంటూ చమత్కరించారు. ఆ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాపై సినిమాటోగ్రాఫర్ రసూల్ పూకుట్టి పై ఆయన పరోక్షంగా బూతులు అర్థం వచ్చేలా ఓ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఆయన పరోక్షంగా జగన్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. విషయంలోకి వెళితే.. ఇటీవల రామోజీరావు (Ramoji Rao) గారు కాలం చేసిన సంగతి తెలిసిందే. ఆయన సంస్మరణ సభలో కీరవాణి పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఆయన స్పీచ్ ఇస్తూ.. “బతికితే రామోజీరావులా బతకాలి … చచ్చినా ఆయనలానే చావాలి. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు.. తన మరణాన్ని ఉత్తరాయణం వచ్చేంత వరకూ వాయిదా వేయడం జరిగింది. అలాగే రామోజీరావు గారు తాను ఎంతో ప్రేమించిన ఆంధ్రప్రదేశ్ కబంద హస్తాల్లోంచి బయటపడడం చూసిన తర్వాతే ఆయన మరణానికి స్వాగతం పలికారు” అంటూ వైసీపీ పాలనపై ఆయన సెటైర్లు విసిరారు.