తెలుగు చిత్ర పరిశ్రమలోరాజమౌళి కీరవాణి కుటుంబానికి ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇండస్ట్రీలో తమకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక గొప్ప రచయిత.రాజమౌళి దర్శకుడిగా పేరు సంపాదించుకోగా కీరవాణి సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే కీరవాణి సోదరిగా ఎంఎం శ్రీలేఖ కూడా అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె ఇండస్ట్రీలో సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా ఈమె ఇండస్ట్రీలోకి వచ్చే పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో 25 దేశాల్లో 25 మంది సింగర్స్ తో ఈ నెల 17వ తేదీ వరల్డ్ మ్యూజిక్ టూర్ ను ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…శ్రీలేఖకు నేను చిన్నప్పుడు చూపించిన ఒక ఆశ వల్ల ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారని తెలిపారు.
తన అన్నయ్య కీరవాణి గొప్ప సంగీత దర్శకుడిగా ఆస్కార్ రేసులో ఉన్నారు. ఈమె కూడా ఆస్కార్ వంటి గొప్ప అవార్డును అందుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీలేఖ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీలేఖ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని తెలిపారు.
ఈ 25 సంవత్సరాల కాలంలో తాను ఇండస్ట్రీలో కొనసాగుతూ పెద్దగా ఆస్తులు ఏవి కూడా పెట్టలేదని ఇప్పటికీ తనకు హైదరాబాదులో సొంత ఇల్లు కూడా లేదని అద్దె ఇంట్లోనే ఉంటున్నాను అని తెలిపారు.ఈ 25 సంవత్సరాల కాలంలో మీ అందరి ప్రేమ అభిమానులను సంపాదించుకున్నాను అంటూ ఈ సందర్భంగా శ్రీలేఖ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.