రైటర్..గా మారిన సంగీత దర్శకుడు శ్రీ వసంత్

  • June 14, 2024 / 07:40 PM IST

అల్లరి నరేష్ సుడిగాడు సినిమాతో సంగీత దర్శకుడిగా సూపరిచుతుడైన శ్రీ వసంత్ పలు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో సుదర్శన్ సుందరం, జగదీష్ ఫళనిస్వామి నిర్మాతలుగా జూన్ 14న విడుదలైన చిత్రం మహారాజ. ఈ సినిమాకు శ్రీ వసంత్ పాటలు, మాటలు రాశారు.

మహారాజ సినిమాలోని “అమ్మ నీకే నాన్నయ్యనా” అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలు పాపులర్ అయ్యాయి, అజనీస్ లోకనాధ్ సంగీతం పాటకు మరో బిగ్ అసెట్. మహారాజ సినిమాకు విడుదలైన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ లభిస్తోంది, అలాగే మహారాజ రివ్యూస్ లో మాటలు, పాటల గురించి కూడా పాజిటీవ్ గా ప్రస్తావించారు.

విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహారాజ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఒక మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ వసంత్ తెలిపారు.

శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ “పోస్ట్ ప్రో మీడియా వర్క్స్” లో మాజరాజ సినిమా డబ్ అవ్వడం జరిగింది అలాగే మంచి విజయం సాధించిన కార్తికేయ 2 కూడా పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ లో డబ్ అవ్వడం విశేషం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus