రకుల్ ప్రీత్ అలా కనిపించినా వాళ్లకి అభ్యంతరం లేదట

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ కన్నడ చిత్రం గిల్లి తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం కెరటం కాగా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ హిట్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. తెలుగులో మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ వంటి అందరు టాప్ స్టార్స్ తో రకుల్ హీరోయిన్ గా చేసింది. ఈ మధ్య హిందీపై ఫోకస్ పెట్టడంతో, తెలుగులో అవకాశాలు తగ్గాయి.

గత ఏడాది ఆమె హిందీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా దే దే ప్యార్ దే చిత్రం చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. ఐతే ఈ అమ్మడు తెలుగులో మరీ శృతి మించిన గ్లామర్ రోల్స్ కానీ ఎక్స్ పోజింగ్ కానీ చేసింది లేదు. ఐతే రకుల్ కి బికినీ వేయడం పెద్ద సమస్య కాదట. రకుల్ ప్రీత్ మథర్ స్వయంగా బికినీ వేసుకోవడంలో ఎంకరేజ్ చేస్తారట. రకుల్ ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొనాల్సి ఉండగా బికినీ వేయాల్సి వస్తుందని బాధపడిందట.

అదే విషయం వాళ్ళ అమ్మతో చెవితే బికినీ వేయడంలో తప్పేంటి అన్నారట. అలా రకుల్ ని వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేసి ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొనేలా చేసిందట. 2011 లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ లో రకుల్ 5వ స్థానంలో నిలిచింది. అలాగే ఆమె ఈ కాంటెస్ట్ లో పీపుల్స్ ఛాయిస్ అవార్డుతో పాటు, ఐదు అవార్డ్స్ గెలుచుకుంది. కాబట్టి బికినీ ధరించే విషయంలో తనకు కుటుంబం నుండి పూర్తి మద్దతు ఉందని రకుల్ ఇటీవల ఓ పత్రికతో పంచుకున్నారు.

1

2

3

4

5

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus