రిషబ్ శెట్టి.. అక్టోబర్ 15 కి ముందు వరకు ఈ పేరు ఎవ్వరికీ పరిచయం లేదు. అసలు ఈ పేరుతో నటుడు ఉన్నాడు అన్న సంగతి కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసుండదు. అయితే ‘కాంతార’ చిత్రంలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ‘కాంతార’ చిత్రానికి ఇతను హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా..! ఓ పక్కన హీరోగా నటిస్తూనే మరోపక్క దర్శకుడిగా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు.
ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించడానికి మన టాలీవుడ్ డైరెక్టర్లు రూ.40 కోట్లు, రూ.50 కోట్లు ఖర్చు పెట్టిస్తుంటే రిషబ్ శెట్టి మాత్రం రూ.16 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించాడు. సరిగ్గా ఈ విషయంలోనే టాలీవుడ్ నిర్మాతలను ఇంప్రెస్ చేసేశాడు రిషబ్ శెట్టి. అందుకే ఇతనికి తెలుగులో నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఆఫర్లు వస్తున్నాయి. ‘కాంతార’ చిత్రాన్ని తెలుగులో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది కాబట్టి.. రిషబ్ తర్వాతి చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ లో చేయమని అల్లు అరవింద్ రిక్వెస్ట్ చేశారు.
అయితే రిషబ్ ‘కాంతార 2’ ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకోసం అల్లు అరవింద్ గారు రిషబ్ ను ఇబ్బంది పెట్టలేదు అని వినికిడి. అయితే రిషబ్ తెరకెక్కించిన అలాగే నటించిన చిత్రాలు ‘బెల్ బాటమ్’ వంటివి ‘ఆహా’ కే ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. రిషబ్ కు ‘మైత్రి’ వారి నుండి ఆల్రెడీ అడ్వాన్స్ వెళ్లిపోయిందట. టాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థల్లో ఒక్కటిగా ఉన్న ‘మైత్రి’ సంస్థ ఆల్రెడీ టాలీవుడ్ బడా స్టార్లందరినీ బుక్ చేసేసుకుంది.
అలాగే పక్క ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోలకు , దర్శకులకు కూడా అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసుకుంది మైత్రి సంస్థ. విజయ్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, సల్మాన్ ఖాన్, సిద్ధార్ద్ ఆనంద్ వంటి వారికి ఆల్రెడీ అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసింది. ఇదే క్రమంలో రిషబ్ శెట్టికి కూడా అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశారు. అయితే అది హీరోగా చేయడం కోసమా లేక డైరెక్షన్ కోసమా అన్నది తెలియాల్సి ఉంది.