ప్రముఖ టీవీ నటుడు, ‘నాగిన్ 3’ ఫేమ్ పరల్ వీ పూరిపై రేప్ కేసు నమోదైందనే వార్త టీవీ ఇండస్ట్రీను కుదిపేసింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు ఇతడి అరెస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో హిందీ టెలివిజన్ రంగాన్ని పలు వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే కరణ్ మెహ్రా అనే టీవీ నటుడు తన భార్యను వేధిస్తున్నాడనే కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతలో మరో నటుడు పరల్ వి పూరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇతడి అరెస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి కారులో తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు ఈ టీవీ నటుడు. తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్వానీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పరల్ వి పూరితో పాటు అతడి ఆరుగురు స్నేహితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం వారంతా కస్టడీలో ఉన్నారని.. విచారణ జరుగుతున్నట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. బాలిక తన కుటుంబంతో కలిసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో శుక్రవారం రాత్రి నటుడు పరల్ వి పూరిని పోలీసులు అరెస్ట్ చేసి.. అతడిపై పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాలీవుడ్ పాపులర్ సీరియల్స్ లో నటించిన పరల్ వి పూరి ప్రస్తుతం ‘బ్రహ్మరాక్షసన్ 2’లో నటిస్తున్నాడు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!