నెటిజన్స్ లో ఆసక్తిరేకెత్తిస్తున్న సినిమా..!

ఇంటర్నెట్ లో సినిమాలకి అలవాటు పడిన యూత్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఎలాంటి సినిమాలనైనా సరే ఆదరించేస్తున్నారు. అందుకే చాలా ఓటీటీ కంపెనీలు అదర్ లాంగ్వేజ్ లో హిట్ అయిన వెబ్ సీరిస్ లని, సినిమాలని తెలుగులో డబ్బింగ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీస్కుని వస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక తమిళ సినిమా ప్రేక్షకుల ముందుకు నారంజి మిఠాయిగా ఆహా టీమ్ తీస్కుని వస్తోంది. సముద్రఖని, సునయన, మణికందన్ , నివేదితా సతీష్ లు ముఖ్యపాత్రల్లో నటించిన ‘సిల్లు కరుప్పత్తి’ అనే సినిమాని తెలుగులో నారింజ మిఠాయిగా అనే టైటిల్ తో అందించబోతున్నారు.

దీనికి సంబంధించిన ఒక ట్రైలర్ ని సైతం రిలీజ్ చేసింది ఆహా టీమ్. ఈనెల 29వ తేదిన ఇది స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. కేవలం మ్యూజిక్ పైన మాత్రమే ట్రైలర్ ని కట్ చేశారు. ఇప్పుడు ఈ ట్రైలర్ నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండానే ఈ ట్రైలర్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. తమిళంలో మంచి క్రేజ్ ని సంపాదించుకుని ఎన్నో అప్లాజస్ పొందిన ఈ సినిమాని పలు ఫిలిం పెస్టివల్స్ లో ప్రదర్సించారు.

బెంగుళూర్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంకా టోరంటో తమిళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీనిని ప్రదర్శించారు. మరి ఈ నారింజ మిఠాయి కథేంటి అనేది తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. అదీ మేటర్.


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus