Naatu Naatu: ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ ఎన్టీఆర్, చరణ్ ల మాస్ డ్యాన్స్ నెంబర్ వచ్చేసింది..!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.ఆల్రెడీ రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిపోయింది. లాగ్ రన్లో మరింత రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. రిలీజ్ తర్వాత కూడా టీం అంతా ప్రమోషన్లలో మరింత హుషారుగా పాల్గొంటున్నారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కాబట్టి ఈ మూవీని కచ్చితంగా ఒక్కసారైనా థియేటర్లలో చూడాలని జనాలు ఫిక్స్ అయ్యారు .ఇక సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడ్డానికి ఎగబడుతున్నారు.

ఇక ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింతగా రప్పించేలా.. తాజాగా ఈ చిత్రంలోని మాస్ సాంగ్ అలాగే బెస్ట్ డ్యాన్స్ మూమెంట్స్ కలిగిన నాటు నాటు వీడియో సాంగ్ ను విడుదల చేసారు. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించగా రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడిన విధానం కానీ హుషారెత్తించే విధంగా ఈ పాటని పాడారు. ఎన్టీఆర్, చరణ్ ల స్టెప్పుల కోసం రెండు మూడు సార్లు చూసేలా ఉంది ఈ వీడియో సాంగ్ ఉంటుంది.

ఎన్టీఆర్ కు జోడీగా నటించిన ఒలీవియా మోరిస్ కూడా ఈ పాటలో చిందులేసింది. భీమ్ ను బ్రిటీష్ వాళ్ళు ఏడిపిస్తున్నప్పుడు రామరాజు ఏ విధంగా వారికి బుద్ది చెబుతూ ఎన్టీఆర్ తో స్టెప్పులు వేయించాడు? అనే థీమ్ తో ఈ పాట సాగుతుంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫి కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పాలి. లేట్ చేయకుండా ఈ పాటని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus