మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కావడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి మూడు పాటలు విడుదల కాగా ఈ మూడు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూడు పాటలలో నాటు నాటు సాంగ్ పెద్ద హిట్ అయింది. అయితే ఈ పాట తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
మూడు వారాల వ్యవధిలో ఈ పాటకు ఏకంగా వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి. టాలీవుడ్ లో కేవలం 21 రోజుల్లో ఈ రికార్డు నాటు నాటు సాంగ్ కు మాత్రమే సొంతమైంది. ఈ సాంగ్ లో చరణ్, ఎన్టీఆర్ కలిసి వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. యూట్యూబ్ లో ఈ పాటకు ఇప్పటివరకు 38 మిలియన్ల వ్యూస్ రాగా వ్యూస్ పరంగా కూడా నాటు నాటు సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి. ఆర్ఆర్ఆర్ యూట్యూబ్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా రికార్డు స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. ఈ సినిమా 1,000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే. బాహుబలి సిరీస్ తో రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డులు ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్రేక్ అవుతాయేమో చూడాల్సి ఉంది. నిర్మాత దానయ్య ఖర్చుకు రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. ఆర్ఆర్ఆర్ లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని తెలుస్తోంది.
Most Recommended Video
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!