Naatu Naatu: నెరవేరిన తెలుగు వారి కల.. ఆస్కార్ అందుకున్న RRR టీమ్!

గత కొద్దిరోజులుగా ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి ఆస్కార్ వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున 5:30 లకు ఆస్కార్ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలను లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక ఈ వేడుకలలో RRR చిత్ర బృందం సందడి చేశారు.

ప్రతి ఏడాది జరిగే ఈ వేడుకల గురించి పెద్దగా ఎవరు పట్టించుకోకపోయినా ఈ ఏడాది మాత్రం ఆస్కార్ వేడుకలపై ప్రతి ఒక్క భారతీయుడు చూపు ఉంది. ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమాలోని నాటు నాటు పాట ది ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ఆస్కార్ నామినేషన్ లో నిలిచింది.

ఇప్పటికే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకుంది. తప్పకుండా ఈ పాట ఆస్కార్ గెలుస్తుందని ప్రతి ఒక్కరు భావించారు.అందుకు అనుగుణంగానే చిత్రబృందం అమెరికాలో గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సందడి చేస్తూ సినిమాని మరింత ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే అందరూ ఎదురు చూసిన విధంగానే ఆ క్షణాలు రానే వచ్చాయి.

అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా నిరూపించుకుంది.ఇలా మొదటిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకు కూడా ఎంతో గర్వకారణంగా నిలిచింది. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో ప్రతి ఒక్క భారతీయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వేడుకను ఎంఎం కీరవాణి నాటు నాటు పాట రచయిత చంద్రబోస్ అందుకున్నారు. ఇలా ఈ పాట ఆస్కార్ అందుకోవడంతో చిత్ర బృందానికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus