Project K: మరో ఇద్దరు హీరోలు.. నిజమేనా?

  • August 6, 2021 / 03:09 PM IST

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ K అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ లో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో స్టార్ క్యాస్ట్ కూడా గట్టిగానే ఉన్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే సినిమా కథ వినగానే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చెప్పేసారు.

తప్పకుండా సినిమా టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకు వెళుతుందని నిర్మాత సి.అశ్వనీదత్ కూడా నమ్మకం వ్యక్తం చేశారు. అయితే సినిమాలో మరో ఇద్దరు తెలుగు హీరోలు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అందులో నాని విజయ్ దేవరకొండ పేర్లు కూడా ఉన్నాయి. ఈ హీరోలతో దర్శకుడికి మంచి అనుబంధమే ఉంది. నాగ్ అశ్విన్ ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించిన విషయం తెలిసిందే. అనంతరం మహానటి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు.

ఇక దర్శకుడు నిర్మాతగా వ్యవహరించిన జాతిరత్నాలు సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో కనిపించి సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాడు. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో గతానికి భవిష్యత్తుకు సంబంధించిన రెండు విభిన్నమైన పాత్రల కోసం నాని విజయ్ దేవరకొండ అను అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. సినిమా టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus