Naga Babu: చిరంజీవి పెద్ద కూతురు ముద్దు పేరు ఇదే.. నాగబాబు ఏమన్నారంటే?

చిరంజీవి (Chiranjeevi) పెద్ద కూతురు సుస్మిత (Sushmita Konidela) గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుస్మిత నిర్మాతగా చిరంజీవి హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తారని గతంలో వార్తలు వచ్చినా వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. సుస్మిత కొణిదెల చిరంజీవి సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా కూడా పని చేస్తూ సత్తా చాటుతున్నారు. సుస్మితను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) సుస్మిత గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నాగబాబు ఈ కామెంట్లు చేశారు. సుష్మిత కొణిదెల నిర్మాతగా పరువు అనే వెబ్ సిరీస్ తెరకెక్కగా నాగబాబు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించారు. నాగబాబు మాట్లాడుతూ సుష్మితను చూసి మా నాన్న కూడా భయపడేవాడని అన్నారు. మా నాన్న అంటే ముగ్గురు అన్నాదమ్ములకు భయమని మా నాన్న మాత్రం హనీ పాప( సుష్మిత ముద్దు పేరు) ను చూసి భయపడేవారని చెప్పుకొచ్చారు.

సుష్మిత ఫస్ట్ మనవరాలు అని గారాబంగా చూసుకునేవారని అయితే సుష్మిత నాన్నను కూడా తిట్టేసేదని నాగబాబు పేర్కొన్నారు. సుష్మిత మోస్ట్ రెస్పాన్సిబుల్ కిడ్ అని ఆయన చెప్పుకొచ్చారు. సుష్మిత ఐపీఎస్ అయ్యి ఉంటే తప్పు చేసిన వాళ్ల తాట తీసేసేదని నాగబాబు వెల్లడించారు. ఇప్పుడు సుష్మిత ఇంట్లో పిల్లలతో సహా మిలిటరీ డిసిప్లీన్ అని మా హనీ పాప అంత పర్ఫెక్ట్ గా పిల్లల్ని పెంచుతుందని నాగబాబు పేర్కొన్నారు.

సుష్మిత చాలా స్ట్రాంగ్ అని నిహారిక (Niharika) చాలా రిలాక్స్డ్ అని ఆయన చెప్పుకొచ్చారు. సుష్మిత, నిహారిక కలిసి కూర్చుంటే గంటలు గంటలు మాట్లాడుకుంటారని నాగబాబు తెలిపారు. సుష్మిత ముద్దుపేరు గురించి నాగబాబు చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. సుష్మిత కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus