Naga Babu: నెటిజెన్ కు ‘జాతి రత్నాలు’ రేంజ్ పంచ్ ఇచ్చిన నాగబాబు..!

గతేడాది డిసెంబర్లో తన కూతురు నిహారిక పెళ్లి చేసాడు మెగా బ్రదర్ నాగబాబు. కోవిడ్ నియమాలను పాటిస్తూనే రాజస్థాన్లో అదిరిపోయే రేంజ్లో ఆమె వివాహాన్ని జరిపించాడు. ఇక కొడుకు వరుణ్ తేజ్ పెళ్లిని కూడా 2021 సమ్మర్ లోపే చేసేస్తాను అని ఇది వరకే నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలియజేసిన సంగతి తెలిసిందే. అందుకే ‘మంచి అమ్మాయి ఉంటే చూడమని’.. తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కు కూడా చెప్పాడు.

అందుకే ఓ నెటిజెన్ వరుణ్ కు ఓ హీరోయిన్ తో పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే నాగబాబుకి చెప్పాడు. ఇంకేముంది నాగబాబులో ఉన్న మీమర్ బయటకి వచ్చి.. ఆ నెటిజెన్ కు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో నాగబాబు వరుస పెట్టి అభిమానుల ప్రశ్నలకు మీమ్స్ తో జవాబులు ఇస్తోన్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కు ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఓ నెటిజెన్ డిసైడ్ అయ్యాడట.

‘వరుణ్ అన్న.. సాయి పల్లవికి పెళ్లి చేస్తా సర్.. జోడి బాగుంటది’ అంటూ ఆ నెటిజెన్ నాగబాబుని కోరాడు. దానికి నాగబాబు రియాక్ట్ అవుతూ.. ‘జాతి రత్నాలు’ సినిమాలో జడ్జిగా బ్రహ్మానందం చెప్పిన డైలాగ్.. ‘తీర్పు కూడా మీరే చెప్పేసుకోండిరా’ అనే వీడియోని పోస్ట్ చేసాడు. అంతే ప్రస్తుతం ఈ టాపిక్ తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో నాగబాబు ఇలాంటి మీమ్స్ తో సోషల్ మీడియాలో సందడి చెయ్యడం మామూలైపోయింది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus