Naga Babu,Varun Tej: రీసెంట్‌ రూమర్స్‌పై రియాక్ట్‌ అయిన నాగబాబు!

నాగబాబులో మంచి కామెడీ టైమింగ్‌ ఉంది. సినిమాల్లో కొన్నిసార్లు ప్రయత్నించినా.. ఆశించిన మేర నటుడిగా విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత టీవీల్లో తన కామెడీ టైమింగ్‌ని చూపిస్తూ వస్తున్నారు. తాజాగా తన చతురత, ఛలోక్తులు, వ్యంగ్యం సోషల్‌ మీడియాలో చూపిస్తున్నారు. ఫాలోవర్స్‌తో చిట్‌ ఛాట్‌ చేయడం, కరెంట్‌ అఫైర్స్‌ గురించి చర్చలు పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ మధ్య కూడా నాగబాబు సోషల్‌ మీడియాలో మాట్లాడారు. ఈ క్రమంలో వరుణ్‌తేజ్‌, నిహారిక గురించి మాట్లాడారు.

Click Here To Watch NOW

తనయుడు వరుణ్‌తేజ్‌ రాజకీయ రంగ ప్రవేశం, వివాహం గురించి నాగబాబు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. దాంతోపాటు నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు సంబంధించిన వివరాల గురించి కూడా నాగబాబు సరదాగా వ్యాఖ్యానించారు. వరుణ్‌తేజ్‌ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని ఓ అభిమాని అడిగితే.. ‘‘రాజకీయాల్లోకి మీరు కూడా రావొచ్చు’’ అని నాగబాబు జవాబిచ్చారు. మరి వరుణ్‌తేజ్‌ పెళ్లి ఎప్పుడు అనే ఓ ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ ‘‘ఆ విషయం వరుణ్‌తేజే చెప్పాలి’’ అని అన్నారు.

నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఏమైంది, ఎందుకు డీయాక్టివ్‌ అయ్యింది అని కొంతమంది ఫ్యాన్స్‌ అడిగారు. ‘‘కోడింగ్‌ నేర్చుకుని నేనే అకౌంట్‌ హ్యాక్‌ చేసి, డీ యాక్టివ్‌ చేస్తా. డీకోడింగ్‌ నేర్చుకోగానే రీయాక్టివ్‌ చేస్తా’’ అని నాగబాబు చమత్కరించారు. దీంతో నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఏమైంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ నటించిన చిత్రాల్లో ఏది మీకు బాగా ఇష్టం అని నెటిజన్లు అడగా… తనకు ‘జల్సా’ సినిమా తనకు బాగా ఇష్టమని నాగబాబు చెప్పుకొచ్చారు.

వరుణ్‌ తేజ్‌ పెళ్లి విషయంలో చాలా రోజుల నుండి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రముఖ కథానాయికతో వరుణ్‌తేజ్‌ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి అని కూడా రాసుకొచ్చారు. మొన్నీమధ్య వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఆమెను కలవాలని వెళ్లాడు అంటూ పుకార్లు వచ్చాయి. అయితే అప్పుడు ఆ కథానాయిక వాటిని ఇన్‌డైరెక్ట్‌గా ఖండించింది. అయితే వరుణ్‌తేజ్‌ వైపు నుండి ఎలాంటి స్పందనా రాలేదు. ఇప్పుడు నాగబాబేమో పెళ్లి వరుణ్‌ ఇష్టం అని అన్నారు. అదీ మేటర్‌.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus