ఇవాళ సాయంత్రంతో ముగియనున్న మా ఎలక్షన్స్ హడావుడి గురించి గత వారం రోజులుగా జరుగుతున్న చర్చ, రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఉదయం మొదలైన ఓటింగ్ కి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు స్వయంగా వచ్చి ఓట్ వేయడం గట్రా చూస్తూనే ఉన్నాం. అలాగే.. ఫిలిమ్ ఛాంబర్ సాక్షిగా మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ ల ఆలింగననాన్ని కూడా చూశాం. ఎలక్షన్స్ లో ఈ హడావుడి గట్రా కామన్ కాబట్టి వీళ్ళ హగ్గులు, వాళ్ళ ఓట్లు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.
అయితే.. ఇవాల్టి ఎలక్షన్స్ నేపధ్యంలో నిన్న నాగబాబు ఓ టీవీ చానల్ లైవ్ లో సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావును ఉద్దేశించి మాట్లాడిన తీరు మాత్రం అత్యంత హేయనీయం. ముసలి కోటా శ్రీనివాసరావు అంటూ నాగబాబు మాట్లాడడం అప్రస్తుతమే కాదు, శోచనీయం. కోటా శ్రీనివాసరావు వ్యక్తిత్వానికి కానీ నటుడిగా ఆయన స్థాయికి కానీ ఏమాత్రం సరితూగని నాగబాబు ఇలా ఆయన్ను అమర్యాదపూర్వకంగా సంభోదించడం ఆయన గురించి అభ్యంతరకరమైన విధంగా మాట్లాడడం క్షమార్హం కాదు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడినవాళ్లందరినీ క్షమాపణ చెప్పాలి అని యూట్యూబ్, ఫేస్బుక్ వీడియోల ద్వారా కోరే నాగబాబు, ఇప్పుడు కోటా శ్రీనివాసరావు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరినా తప్పులేదు.
తెలుగు నటులను కాకుండా పరాయి బాషా నటులను తెలుగు సినిమాల్లో తీసుకోవడం అనే విషయంపై కోటా గత రెండు దశాబ్ధాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలుగు నటులకు అవకాశాలు, గౌరవం ఇవ్వండయ్యా అని ఆయన ఎప్పట్నుంచో మొత్తుకుంటూనే ఉన్నారు. అలాంటిది.. “మా ఎలక్షన్స్” విషయంలో ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని బాహాటంగా చెప్పి.. ప్రకాష్ రాజ్ తో తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ షేర్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. దానికోసం నాగబాబు ఇలా దిగజారి మాటలనడం అనేది నీచం!
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు